జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి చేరిన కాటసాని

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

katasani
Updated:  2018-04-29 01:32:04

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి చేరిన కాటసాని

ప్ర‌తిప‌క్ష‌నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం సైకిల్ పార్టీ కంచుకోట  కృష్ణా జిల్లా కనుమూరు సమీపంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయ‌కుడు కాట‌సాని రాం భూపాల్ రెడ్డి  వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.. ఈ సంద‌ర్భంగా కాట‌సాని మాట్లాడుతూ దివంగ‌త నేత‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో రాష్ట్రం అభివృద్ది చూసాన‌ని ఆ త‌ర్వాత అభివృద్ది అనే మాట‌ రాష్ట్రంలో ఎక్క‌డా చూడ‌లేద‌ని అన్నారు... అయితే భాగ్యం జ‌గ‌న్ ద్వారా ద‌క్కుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.
 
ఇక దీంతో పాటు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు పై నిప్పుల చేరిగారు కాట‌సాని ... చంద్రాబాబు అధిరంలోకి వ‌చ్చాక రాష్ట్రం అన్యాయంగా బ‌లైపోతుంద‌ని అన్నారు... విచ్చ‌ల విడిగా ఎక్క‌డ చూసిన అవినీతి అక్రమాలకు టీడీపీ నాయ‌కులు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు..పంటలకు గిట్టుబాటు ధర  కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
 
కాగా తొలిసారి పాణ్యం నుంచి 1985లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బి.సత్యనారాయణరెడ్డిపై 4,059 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు కాట‌సాని. ఆతర్వాత 1989లో, 1994లో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు... 1999లో టీడీపీ అభ్యర్థి పార్థసారథి చేతిలో ఓటమి చవిచూసిన కాటసాని.. 2004లో అదే పార్థసారథిని ఓడించారు....అలాగే 2009 లో తెలుగుదేశం అభ్య‌ర్ది బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పై  8,914 ఓట్ల తేడాతో గెలుపొందారు... ఇక ఆయ‌న తొలి నుంచి కాంగ్రెస్ నాయకుడిగానే నిల‌బ‌డ్డారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.