29న వైసీపీలోకి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-24 14:57:27

29న వైసీపీలోకి

వైసీపీలోకి నాయ‌కుల చేరిక‌లు జోరు అందుకున్నాయి అనే చెప్పాలి... ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ కోస్తా ఆంధ్రాలోకి అడుగుపెట్టేస‌రికి వైసీపీలోకి వ‌ల‌స‌లు జోరు అందుకున్నాయి.. ఇప్ప‌టికే ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు జ‌గ‌న్ స‌మ‌క్షంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసీపీలో చేరారు. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం రాయ‌ల‌సీమ‌లో కూడా వైసీపీలోకి వ‌ల‌స‌లు వ‌స్తున్నారు నాయ‌కులు.
 
బీజేపీ రాష్ట్ర నాయకుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 29న జగన్‌ పాదయాత్రలో భాగంగా గుడివాడలో వైసీపీ కండువా వేసుకోనున్నారు అని తెలుస్తోంది. పాణ్యం నియోజకవర్గం నుంచి ఐదు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. 60వేలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 
 
ఇక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కాటసాని కాంగ్రె‌స్‌ను వీడి బీజేపీలో చేరారు. రాష్ట్ర నాయకుడుగా ఆ పార్టీలో చురుకైన పాత్రను పోషించారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీజేపీని వీడాలనే ఆలోచనకు వచ్చారు. ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఈ నెల 18న వీజేఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ఇక బీజేపీ ఏపీకి ఎటువంటి న్యాయం చేయ‌లేదు అని ఇక్క‌డ బీజేపీ త‌ర‌పున నిల‌బ‌డినా గెలిచే అవ‌కాశాలు లేక‌పోవ‌డం తో వైసీపీలోకి వెళ్లాలి అని స‌న్నిహితులు కూడా తెలియ‌చేశారు. ఇక బీజేపీ ఇచ్చిన డిక్ల‌రేష‌న్ పై కూడా రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు న‌మ్మేస్దితిలో లేరు అని అంటున్నారు  ప్ర‌జ‌లు.
 
ఇక కార్య‌క‌ర్త‌లు కూడా కాట‌సానికి వైసీపీలో చేరాలి అని తెలియ‌చేశారు... వారి అభిప్రాయం ప్ర‌కారం ఆయ‌న వైసీపీలో చేరుతున్న‌ట్లు తెలియ‌చేశారు.ఈ మేరకు గుడివాడలో జగన్‌ పాదయాత్రలో ఆయన సమక్షంలోనే వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయ‌న వైసీపీలో చేరే స‌మ‌యంలో ఆయ‌న‌తో పాటు.... కర్నూలు నగరం, పాణ్యం, ఓర్వకల్లు, గడివేముల మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులతో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
 
ఇక ఇప్పుడు ఆయ‌న పార్టీలో చేరినా ఆయ‌న‌కు ఎటువంటి హామీ లేద‌ని... సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు సీటు ఇచ్చేలా నే జ‌గ‌న్ ఉన్నార‌ని, ఆయ‌న‌కు పార్టీలో స‌ముచిత స్ధానం ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు జిల్లా వైసీపీ నాయ‌కులు.. ఇక ఫిరాయింపుల‌తో కర్నూలులో వైసీపీని నీరుగార్చే ప్ర‌య‌త్నం చేశారు... అయితే జిల్లాలో  మ‌ళ్లీ వైసీపీ పుంజుకుంటోంది. ఈ నియోజకవర్గానికి గౌరు చరిత  ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు... ఆమె సీటుకు ఎటువంటి డోకా లేదు అని వైసీపీ నుంచి హామీ వ‌చ్చింది అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.