వైసీపీలోకి లైన్ క్లియ‌ర్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-19 14:57:25

వైసీపీలోకి లైన్ క్లియ‌ర్ ?

రాయ‌ల‌సీమ‌లో వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి నాయ‌కులు క్యూ క‌డుతున్నారు... ఇక తాజాగా క‌ర్నూలు జిల్లాలో కీల‌క నేత వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.. పార్టీ ఏదైనా ప్రజాభీష్టం మేరకు పాణ్యం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు... పాణ్యం నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ర్త‌లు కేడ‌ర్ తో ఆయ‌న స‌మావేశ‌మై చ‌ర్చించారు.
 
మాజీ కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సింగిల్‌ విండో అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 90 శాతం మంది నాయకులు వైసీపీలో చేరాలని కాటసానికి సూచించారు. రాజకీయ భవిష్యత్తు, కార్యాచరణ నిర్ణయానికే సమావేశం ఏర్పాటు చేశామని, కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యమని కాటసాని స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో కార్యకర్తల సూచనల మేరకు నడుచుకుంటానని, 2,3 రోజుల్లో వారి సమక్షంలోనే నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.
 
కాటసాని రాంభూపాల్‌రెడ్డికి ఎల్లవేళలా వెన్నంటి ఉన్న కార్యకర్తలు, అభిమానులకు కాటసాని ఉమామహేశ్వరమ్మ కృతజ్ఞతలు తెలిపారు. కాట‌సాని ఎంట్రీ వైసీపీలో ప‌క్కా అని ఇప్ప‌టికే ప‌లువురు చ‌ర్చ‌లు జ‌రిపారు అని అంటున్నారు...రాష్ట్ర విభజన త‌ర్వాత  కాటసాని కాంగ్రెస్‌ పార్టీని వీడి 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారని 62వేల ఓట్ల నమోదుతో ద్వితీయ స్థానంలో నిలిచారు. కాటసాని తనయుడు శివనరసింహారెడ్డి సమావేశానికి హాజ‌ర‌య్యారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.