వైసీపీ వైపు మ‌రో నేత చూపు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

katasani ram bhupal reddy ycp
Updated:  2018-04-11 11:32:26

వైసీపీ వైపు మ‌రో నేత చూపు ?

పాణ్యం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయ‌కుడు కాట‌సాని రాం భూపాల్ రెడ్డి రాజ‌కీయంగా మ‌రో నిర్ణ‌యం తీసుకోనున్నారు.. ఈ నెల 18న  కర్నూలులో కార్యకర్తలతో ఆయ‌న సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు... ఇక ఆయ‌న బీజేపీని వీడాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటు ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌క‌పోవ‌డం అలాగే బీజేపీలో కొన‌సాగితే  రాజ‌కీయ భ‌విత‌వ్యం ఏమిటి అని ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తోంది.
 
ఇక ఆయ‌న వైసీపీలో చేరే అవ‌కాశం ఉంది అని అంటున్నారు ఆయ‌న అభిమానులు స‌న్నిహితులు..ఇక చాలా మంది అనుకుంటున్న విధంగా తాను పాణ్యం వ‌దిలి వెళ‌తాను అని అనుకోవ‌ద్ద‌ని, తాను పాణ్యం నుంచే రాజ‌కీయాల్లో ఉంటాన‌ని ఆయ‌న తెలియ‌చేశారు... కాట‌సాని ఎమ్మెల్యేగా ఇక్క‌డ ఐదుసార్లు గెలుపొందారు.
 
తొలిసారి పాణ్యం నుంచి 1985లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బి.సత్యనారాయణరెడ్డిపై 4,059 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆతర్వాత 1989లో, 1994లో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు. 1999లో టీడీపీ అభ్యర్థి పార్థసారథి చేతిలో ఓటమి చవిచూసిన కాటసాని.. 2004లో అదే పార్థసారథిని ఓడించారు....అలాగే 2009 లో తెలుగుదేశం అభ్య‌ర్ది బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పై  8,914 ఓట్ల తేడాతో గెలుపొందారు... ఇక ఆయ‌న తొలి నుంచి కాంగ్రెస్ నాయకుడిగానే నిల‌బ‌డ్డారు.
 
2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా పోటీ చేశారు...వైసీపీ త‌ర‌పున గౌరు చ‌రితా రెడ్డి ఇక్క‌డ విజ‌యం  సాధించారు.. త‌ర్వాత కాట‌సాని  రాం భూపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.. ఇక ఆయ‌న బీజేపీలో కొన‌సాగినా ఏపీకి ప్ర‌త్యేక హూదా విష‌యంలో ఎటువంటి నిర్ణ‌యం బీజేపీ తీసుకోక‌పోవ‌డం అలాగే రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ కూడా బీజేపీ ఇచ్చినా అమ‌లు పై నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.. అయితే ఆయ‌న పాణ్యం నుంచి బ‌య‌ట‌కువెళ్లేదే లేదు అంటున్నారు... ఇటు ఆయ‌న మ‌రి వైసీపీలో చేరితే సిట్టింగ్ ఎమ్మెల్యే చ‌రితా రెడ్డి ఎటువంటి ఆలోచ‌న చేస్తారా అనేది వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.