క‌త్తి రూటు మారింది ప‌వ‌న్ నుంచి చిరువైపు రీజన్.....?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-06 06:56:08

క‌త్తి రూటు మారింది ప‌వ‌న్ నుంచి చిరువైపు రీజన్.....?

 గ‌త నాలుగు నెల‌లుగా  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఆయ‌న అభిమానుల పై సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచారు... ఈ క్ర‌మంలో క‌త్తి మ‌హేష్ విమ‌ర్శ‌లను ఖండిస్తూ  ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ అభిమానులు వారి  స్టైల్లో కామెంట్ల‌తో విరుచుకుప‌డేవారు చివ‌రకు ఓ మీడియా వేదిక‌గా వీరి ఇరువురి వివాదానికి తెర‌ప‌డింది..
 
ఇటీవ‌ల జ‌న‌వ‌రిలో విడుద‌లైన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వెబ్ సిరీస్ సినిమాను ట్యాగ్ చేస్తూ రామ్ గోపాల్ వ‌ర్మకు క‌త్తి మ‌హేష్ స‌పోర్ట్ చేయ‌డంతో ఈ న్యూస్ పెద్ద‌గా వైర‌ల్ కాలేదు... ఈ క్ర‌మంలోనే మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌ హీరోగా న‌టించిన చిత్రం ట‌చ్ చేసి చూడు ఈ చిత్రం గ‌త వారం విడుద‌లైంది. సినిమా అభిమానుల‌ను అల‌రించినా, బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌లేక‌పోతోంది...ఈ సినిమాని చూసిన క‌త్తి మ‌హేష్ త‌న‌దైన శైలిలో ఈ సినిమా 
చూసిన వారు ఎవ్వ‌రిని ట‌చ్ చేయ‌ర‌ని, అంత దారుణంగా ఉందంటూ విమ‌ర్శించారు..
 
మ‌ళ్లీ ప‌వ‌న్ విష‌యంలో చేసుకున్న ఒప్పందాన్ని మ‌రిచి మెగాఫ్యామిలీ జోలికి వ‌చ్చాడు క‌త్తి మ‌హేష్.. తాజాగా ప‌వ‌న్ అన్న చిరంజీవిని విమ‌ర్శించాడు క్రిటిక్ మ‌హేష్ ..2018 - 2019 సంవ‌త్స‌రానికి  సంబంధించి కేంద్రం బ‌డ్జెట్ ను ప్ర‌క‌టించింది... ఈ బ‌డ్జెట్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి  పూర్తిగా అన్యాయం జ‌రిగింది... అయితే ఈ బ‌డ్జెట్ లో త‌మ రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌ని అధికార పార్టీ ఎంపీలు, ప్ర‌తి ప‌క్ష‌పార్టీ ఎంపీలు  బ‌డ్జెట్ కు వ్య‌తిరేఖంగా  పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు... అయితే  నిరసనకు దిగిన ఏపీ ఎంపీలలో మెగాస్టార్ చిరంజీవి కనిపించ‌లేదంటూ తనదైన శైలిలో కత్తి  మహేష్  ట్వీట్ చేశారు.
chiranjeevi
 
క‌త్తి మ‌హేష్ చేసిన ఈ ట్విట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది... మరి ప‌వ‌న్ అభిమానులు స్పందించిన‌ట్లు, చిరు అభిమానులు కూడా !! లెట్స్ డూ క‌త్తి ఎగ్ నెస్ట్ ట్వీట్లు !! అంటారా అనేది ఇప్పుడు వైర‌ల్ టాపిక్ గా మారుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.