క‌త్తి మ‌హేష్ కు వైసీపీ కొత్త పేరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-07 10:41:21

క‌త్తి మ‌హేష్ కు వైసీపీ కొత్త పేరు

సినీక్రిటిక్ క‌త్తి మ‌హేష్ గ‌త కొద్ది కాలంగా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్, ఆయ‌న అభిమానుల‌పై త‌న దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే... ఈ విమ‌ర్శ‌లు ఎవ‌రు ఊహించ‌ని విధంగా సుమారు నాలుగు నెల‌ల పాటు సాంకేతిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేశాయి... వీరిరువురు ప్ర‌ముఖ ఎల్లో మీడియా స‌మ‌క్షంలో ఒక్క‌టై ట్వీట్ ల‌కు స్వ‌స్తి చేప్పారు...
 
దీంతో క‌త్తి మ‌హేష్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో కొంత కాలం పాటు ప‌వ‌న్ పై ఆయ‌న అభిమానుల‌పై  మాట‌కు క‌ట్టుబ‌డి ఉండి వారిపై ఎలాంటి ట్వీట్ చేయ‌లేదు... అప్పుడ‌ప్పుడు  పేరు ప్ర‌స్తావించ‌కుండా  ప‌రోక్షంగా ట్వీట్ చేస్తున్నా వాటిని ప‌వ‌న్ అభిమానులు పెద్ద‌గా వ్య‌తిరేకించ‌లేదు... ఆపై ఏపీ పాలిటిక్స్ పైనా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై అలాగే ప్ర‌త్యేక హోదా గురించి ట్వీట్ చేసి మ‌రోసారి తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో క్రిటిక్ నుంచి పాలిట్రిక్స్ కు మ‌ళ్లారు క‌త్తి.
 
దీంతో పాటు దేశ రాజ‌ధాని ఢిల్లీలో వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న ప్రత్యేక ఆందోళన మహాసభలో  కత్తి మ‌హేష్  కనపడడం ప్ర‌స్తుతం  అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది... దీంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్రేరేపిస్తూ వైసీపీ నేత‌లు సోష‌ల్ మీడియా టైగ‌ర్ అనే పేరును ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది...
 
జ‌గ‌న్ కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొన‌క పోయినా తెర‌వెనుక నుంచి  వైసీపీ పార్టీ కార్య‌క‌లాపాల‌ను, ప్ర‌క‌ట‌న‌ల‌ రూప‌క‌ల్ప‌న చేసే ప‌నిలో క‌త్తి ఉన్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది... ఈ నేప‌థ్యంలో మహేష్ వైసీపీ లో చేరుతారంటూ చాలామంది రాజకీయ నాయకులు చెపుతున్న మాట‌... వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రపున క‌త్తి మ‌హేష్ ను రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఏదో ఒక సెగ్మెంట్ నుంచి పోటీ చేయించ‌నున్నార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.