టీడీపీకి గురి పెట్టిన క‌త్తి మ‌హేష్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-26 04:31:06

టీడీపీకి గురి పెట్టిన క‌త్తి మ‌హేష్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పై విమ‌ర్శ‌లు చేసి తెలుగు రాష్ట్రాల్లో త‌న ర్యాపో పెంచుకున్నారు సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్. ప‌వ‌న్ అభిమానుల‌కు క‌త్తికి మ‌ధ్య జ‌రిగిన వివాదం అంద‌రికి తెలిసిందే. అయితే క‌త్తి మ‌హేష్ చేసే విమ‌ర్శ‌ల్లో లోతైన లోచ‌న ఉంటుందంటారు నెటిజెన్లు. సినీ రివ్యూ  విష‌యంలో ఉన్న‌ది ఉన్న‌ట్టుగా  వెల్ల‌డించే వ్య‌క్తి క‌త్తి మ‌హేష్ అని పేరు సంపాదించారు.
 
తాజాగా ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వం పై ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లు తీవ్ర వ్యాఖ్య‌లు  చేశారు. భాగ‌స్వామ్య స‌ద‌స్సు, విదేశీ పెట్టుబడుల పేరుతో వందల కోట్లు ప్రభుత్వ ధనం వృధాగా ఖర్చు చేస్తున్నార‌ని క‌త్తి విమ‌ర్శించారు. లక్షల కోట్ల MOU లు పై సంతకం చేశామని ప్రగల్భాలు పలకడం టీడీపీకే సాధ్యం అని అన్నారు. వందల కోట్ల ప్రాజెక్టులు మాత్రమే నిజమౌతాయే త‌ప్ప‌....రాష్ట్ర ప్ర‌జ‌ల మీద తెచ్చిన‌ లక్షల కోట్ల అప్పులు మాత్రమే చివ‌రికి మిగులుతాయ‌ని ఆయ‌న‌ తెలిపారు. సొమ్ము ఏమో రాష్ట్ర‌ ప్రజలది, సోకేమో ముఖ్య‌మంత్రి చంద్రబాబుది, అప్పు ప్రభుత్వానిదంటూ క‌త్తి మ‌హేష్‌ ఎద్దేవా చేశారు. 
 
అప్పులు సంపాదించగలగటమే అభివృద్ధికి మెగా ఇండికేటర్ అని చంద్రబాబు చెప్పడం, మనం నమ్మడం,  ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలుకావ‌డం, మనభవిష్యత్తు లోకేష్ పాలుకావ‌డమే కమ్మోళ్లకు, తెలుగుదేశం పార్టీకి కావలసిందని ఆయ‌న తెలిపారు. కమ్మోళ్లకు తప్ప మరే కులపోళ్ళకూ చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఎందుకు కనపడదు చెప్మా! అంటూ క‌త్తి మహేష్ పోస్ట్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.