ఆ హీరోల‌పై క‌త్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-11 04:51:37

ఆ హీరోల‌పై క‌త్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారి  గ‌త నాలుగు నెలలుగా క‌త్తి మ‌హేష్ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఆయ‌న ఆభిమానుల‌పై త‌న దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ కొంత కాలంగా వార్త‌ల్లో నిలిచారు.... అయితే ఈ వివాదాల‌కు చెక్ పెట్టేందుకు ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ వేదిక‌గా ప‌వ‌న్ అభిమానులు, క‌త్తి మ‌హేష్  ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే... వీరిరువురూ ఒక్క‌టి కావ‌డంతో క‌త్తి త‌న సోష‌ల్ మీడియాకు ప‌దును త‌గ్గించారు... 
 
ఇటీవ‌లే తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి  వ‌రుస సినిమాలు గాయ‌త్రి, మెగా వార‌సులు న‌టించిన తొలిప్రేమ, ఇంటిలిజెంట్ చిత్రాలు విడుద‌ల అయిన నేప‌థ్యంలో క‌త్తి త‌న సోష‌ల్ మీడియాకు ప‌దును పెట్టారు.... ఈ మూడు వ‌రుస సినిమాల్లో  తొలి ప్రేమ త‌ప్ప ఏ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం లేద‌ని అన్నారు క‌త్తి... తొలిప్రేమ చిత్రంలో మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంద‌ని క‌త్తి అన్నారు... కాగా ఇదే త‌రహాలోనే విడుద‌లైన చిత్రాలు గాయ‌త్రీ, ఇంటిలిజెంట్ ఈ రెండు సినిమాలు ఎమోష‌న‌ల్ డెప్త్ లేక‌పోవ‌డంతో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక పోతోంద‌ని ట్విట్ చేశారు క‌త్తి...
 
అందులో భాగంగానే ఈ సారి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న ప్ర‌తీ ఒక్క హీరోని అలాగే అభిమానుల‌ను పేరు పెట్ట‌కుండా విమ‌ర్శిస్తూ... ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు క‌త్తి మ‌హేష్... హీరో ఫ్యాన్స్ వల్ల సినిమాలు హిట్ ఆవ్వవు. ప్రేక్షకులు అందరూ, 'సినిమా బాగుంది  అని చూస్తే సినిమాలు హిట్ అవుతాయి అన్నారు... ఇప్పటికైనా అటు హీరోలు, ఇటు ఫ్యాన్స్ బుద్ధి తెచ్చుకుని, ఇమేజ్ చట్రాలు, ఫ్యాన్స్ కోరికలు అని పోకుండా. కథ మీద, దర్శకుడి ప్రతిభ మీద గౌరవం ఉంచి సినిమాలు చేస్తే బెటర్ అని ట్వ‌ట్ చేశారు క‌త్తి మ‌హేష్..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.