క‌త్తి సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan and katti mahesh
Updated:  2018-03-29 06:53:46

క‌త్తి సంచ‌ల‌న ట్వీట్

సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ గ‌త కొద్ది కాలంగా  సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై అలాగే ఆయ‌న అభిమానుల‌పై త‌న దైన శైలిలో విమ‌ర్శ‌లు చేసి వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిందే.. ఈ వార్ సుమారు నాలుగు నెల‌ల పాటు సాగింది... అయితే ఈ వివాదం  ఎక్క‌డి వ‌ర‌కు దారి తీస్తుందోన‌ని భావించి ప‌వ‌న్ సూచ‌న‌ల మేర‌కు ఓ ప్ర‌ముఖ ఆస్ధాన‌ మీడియా స‌మ‌క్షంలో వీరిరువురు ఒక్క‌ట‌య్యారు.
 
ఆ తర్వాత నుంచి క‌త్తి మ‌హేష్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో ప‌వ‌న్ అభిమానుల‌పై ఎటువంటి పోస్ట్ లు పెట్ట‌లేదు...కానీ అప్పుడప్పుడు పేరు ప్ర‌స్తావించకుండా ప‌రోక్షంగా ప‌వ‌న్ అభిమానుల‌పై విమర్శ‌లు  చేసేవారు... కానీ త‌మ అధినేత ప‌వ‌న్ సూచ‌న‌ల మేర‌కు అభిమానులు క‌త్తి మ‌హేష్ పై ఎలాంటి పోస్టులు పెట్ట‌లేదు... దీంతో క‌త్తి త‌న ప‌దునును ప‌వ‌న్ అభిమానుల‌పై కాకుండా రాజ‌కీయ‌ప‌రంగా కామెంట్స్ చేస్తూ మ‌రోసారి వార్త‌ల్లో నిలుస్తున్నారు. 
 
అయితే తాజాగా క‌త్తి  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై  అలాగే ప‌వ‌న్ ల‌పై ఓ ట్వీట్ చేశాడు...అదేంటంటే ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలవాలంటే. రెండువారాల్లో కలవ‌చ్చు... అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహ‌న్ రెడ్డిని కలవాలంటే.... రేపే ఆయ‌న పాదయాత్ర ఎక్కడో కనుక్కుని అక్కడకి వెళ్లి కలవవ‌చ్చు.... కానీ జనసేన పార్టీ అభిమాని, దిలీప్ సుంకర పవన్ ని కలవాలంటే...4 సంవత్సరాలు ప‌డుతుంద‌ని అన్నారు... ఇది జనసేన కాదని, జమసేన !!కర్సైపోతావ్ రో!! అంటూ ట్వీట్ చేశారు క‌త్తి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.