సీనియ‌ర్ నేత‌ను గెంటేసిన టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kavitha image
Updated:  2018-03-11 04:52:00

సీనియ‌ర్ నేత‌ను గెంటేసిన టీడీపీ

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ యాక్ట‌ర్ క‌విత తెలుగు దేశం పార్టీ గుడ్ బై చెప్పి  బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో విజయవాడపార్టీ కార్యాలయంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను టీడీపీ పార్టీ నుంచి వెళ్ల‌లేద‌ని త‌న‌ను తెలుగు దేశం పార్టీ నాయ‌కులు బ‌ల‌వంతంగా నెట్టేశార‌ని ఆమె అన్నారు... 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున విజ‌యవాడ న‌గ‌ర‌మంతా విస్త్రృతంగా ప్ర‌చారం చేసినా కూడా కొంచెం కూడా విశ్వాసం లేకుండా నిర్ధాక్ష‌ణంగా త‌న‌ను పార్టీ నుంచి తోసేశార‌ని క‌విత తెలిపారు...
 
మాజీ ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు హ‌యాంలో 1983లో టీడీపీలో చేరాన‌న్నారు క‌విత... నాటి నుంచి నేటివ‌ర‌కు పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నా కానీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌ను గుర్తించ‌లేద‌ని వెళ్ల‌డించారు... తెలుగు దేశం పార్టీ కేవ‌లం మ‌హిళల పార్టీ అని చెప్పుకునే నాయ‌కులు తెర‌వెనుక కొంచెం కూడా మ‌హిళ‌ల‌కు మ‌ర్యాద‌ ఇవ్వ‌ర‌ని క‌విత తెలిపారు..
 
అయితే తాను ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన అనేక  పథకాలు నచ్చడంతోనే బీజేపీలో చేరానని తెలిపారు. ఆయ‌న స్పూర్తితోనే బీజేపీలో చేరాన‌ని క‌విత అన్నారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.