హ‌రికృష్ణ మృతిపై ఇరు ముఖ్య‌మంత్రులు విచారం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu and kcr
Updated:  2018-08-29 11:57:43

హ‌రికృష్ణ మృతిపై ఇరు ముఖ్య‌మంత్రులు విచారం

రోడ్డు ప్ర‌మాదంలో న‌టుడు హిందూపురం మాజీ ఎమ్మెల్యే హ‌రికృష్ణ మృతి చెందడంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. హ‌రికృష్ణ బ్ర‌తికున్నప్పుడు ఎన‌లేని సేవ‌లు అందించార‌ని, ఆయ‌న సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని కేసీఆర్ గుర్తు చేశారు. ఇదే క్ర‌మంలో ఆయ‌న బావ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.
 
హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాద వార్త తెలియ‌గానే వెంట‌నే చంద్ర‌బాబు ఆసుప‌త్రి సిబ్బందితో మాట్లాడి మెరుగై వైద్యం అందించాల‌ని కోరారు. కానీ కొద్ది నిమిషాల‌కే భావ‌మ‌రిది మ‌ర‌ణ‌వార్త తెలియ‌గానే ఈరోజు కార్య‌క్ర‌మాలన్ని ర‌ద్దు చేసుకుని నార్కాట్ ప‌ల్లి కామినేని ఆసుప‌త్రికి చేరుకోనున్నారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు, హ‌రికృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించ‌నున్నారు.
 

షేర్ :