కేంద్రం పై క‌న్నెర్ర చేసిన కేసీఆర్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kcr
Updated:  2018-03-28 03:44:21

కేంద్రం పై క‌న్నెర్ర చేసిన కేసీఆర్‌

దేశ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి.మ‌ఖ్యంగా కేంద్రంలో  అధికారంలో ఉన్న బీజేపీ పై గ‌త కోంత‌ కాలంగా  ప్రాంతీయ పార్టీలు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నాయి. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయ‌మ‌ని అనేక సార్లు విన్న‌వించుకున్నా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తూ, నియంతృత్వంగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని ప‌లువురు పార్టీ నాయ‌కులు ప‌లు సంద‌ర్బాల్లో వ్యాఖ్యానించిన‌ విష‌యం తెలిసిందే.... తాజాగా ఇదే అంశం పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్  కూడా స్పందించారు.
 
తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా టీఆర్‌య‌స్ పార్టీని స్థాపించాము. అప్ప‌టి నుంచి రాష్ట్రం ఏర్ప‌డే వ‌ర‌కూ  ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండి ఉద్య‌మం చేశామ‌ని అన్నారు. తెలంగాణ నూత‌న రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌ర్వాత  అధికారాన్ని చేప‌ట్టిన టీఆర్‌య‌స్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసి, ప్ర‌జ‌ల‌ను, రాష్ట్రాన్ని అభివృద్ది చేయ‌టంలో దేశంలో మొద‌టి స్థానంలో ఉన్నామ‌ని అన్నారు.  జీడీపీ - తలసరి ఆదాయం వంటివాటిలో జాతీయ సగటుకన్నా తెలంగాణ సగటు ఎక్కువగా ఉంద‌న్నారు. ఈ రోజు దేశాన్ని సాకుతున్న ఏడు రాష్ట్రాల‌లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. తను - తన  ప్రభుత్వం  అవినీతి చేస్తే నిరూపించాలని కేసీఆర్ సవాల్ విసిరారు. గ‌తంలో ఉన్న అవినీతిని మేం పూర్తిగా అరికట్టాం. ఇంత‌కు ముందు కాంట్రాక్టు ఇస్తే ఈపీసీ - మొబిలైజేషన్ అడ్వాన్స్‌ లు అని అవినీతి ఉండేది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాట‌న్నింటిని తోలిగించామ‌ని అని కేసీఆర్ తెలిపారు.
 
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి చెందుతున్న  రాష్ట్రాల‌కు సహకారం ఇవ్వాలని కోరానని అయినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రాలు అడుక్కునే పరిస్థితిలో కాకుండా డిమాండ్ చేసే స్థాయిలో ఉండాలని ఆయ‌న అన్నారు. వ్యవసాయశాఖ, ఆరోగ్యశాఖ, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖలు కేంద్రం దగ్గర ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్రం నియంతృత్వంగా ప్ర‌వ‌ర్తిస్తూ రాష్ట్రాల‌ను వెన‌క్కు నెడుతుంద‌ని కేసీఆర్ అన్నారు. పరిస్థితి ఇలానే కొన‌సాగితే జాతి సమగ్రతకు పెను ముప్పు క‌లుగుతుంద‌ని అన్నారు. దేశం ముందుకు వెళ్లాలంటే రాజకీయంగా గుణాత్మకమైన మార్పు రావాలని అన్నారు. అందులో కీల‌క పాత్ర పోషించ‌డానికి నేను సిద్దం అని కేసీఆర్ తెలిపారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.