అదే ఫైన‌ల్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-08 16:12:28

అదే ఫైన‌ల్ ?

థ‌ర్డ్ ఫ్రంట్ తో కేసీఆర్ మ‌రింత పొలిటిక‌ల్ స్టార్ అవుతున్నారు... బంగారు తెలంగాణ సాధ‌న‌లో తెలంగాణ యంత్రాంగం నాయ‌క‌త్వం ఉంటుంది అని... బంగారు భార‌త్ చేసే దిశ‌గా కేంద్రంలో చ‌క్రం తిప్పేలా కేసీఆర్ ముందుకు వెళుతున్నారు...
 
అయితే ఈ స‌మ‌యంలో క‌ర‌క‌ట్ట‌కు వేళ్లేలా చేసిన ఓటుకు నోటు కేసు తెర‌పైకి వ‌చ్చింది.. చంద్ర‌బాబును ఎవ‌రూ కాపాడ‌లేరు అంటూ గ‌తంలో కామెంట్ చేసిన సీఎం కేసీఆర్... తాజాగా ఈ కేసును తెర‌పైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు అంద‌రూ దీని గురించే చ‌ర్చించుకుంటున్నారు. ఆ వాయిస్ బాబువి అని రిపోర్టులు తేల‌డంతో ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇదే  చ‌ర్చ జ‌రుగుతోంది.
 
మ‌న వాళ్లు బ్రీఫ్ డు మీ అనే వాయిస్ నేటికి సోష‌ల్ మీడియాలో ఎక్క‌డో ఓ చోట వినిపిస్తూనే ఉంటోంది.. ఇప్ప‌టికే మూడేళ్లు అయిపోయినా, ఆ  కేసు విష‌యంలో కేసీఆర్ స‌ర్కారు ఎటువంటి పురోగ‌తి సాధించ‌లేదు అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి..కేసీఆర్ సమీక్ష జ‌ర‌ప‌డంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లం మొద‌లైంది. ఓటుకునోటు కేసుపై స‌మీక్షించటమే కాకుండా చంద్ర‌బాబు భూ ఆక్ర‌మ‌ణ‌ల‌పైన వారంలోగా ఓ క‌మీష‌న్ వేయాల‌ని నిర్ణ‌యించ‌టం సంచ‌ల‌నం రేపుతోంది. 
 
అయితే మ‌నపై కేంద్రం కక్ష క‌ట్టింది అని అన్నారు చంద్ర‌బాబు... ఇప్పుటు తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంతో స‌యోధ్య‌గా లేరు, ఇది బీజేపీ ఆడుతున్న పొలిటిక‌ల్ గేమ్ కాదు అనేది  దీంతో తేలిపోయింది. గ‌త కొద్ది కాలంగా చంద్ర‌బాబు-కెసిఆర్ మ‌ధ్య ఏమాత్రం స‌ఖ్య‌త లేద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక త‌న స‌ర్కారును కూల్చాలి అని అనుకున్న చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని ఉద్దేశాన్ని ప‌దేప‌దే స‌మావేశాల్లో కూడా ఆయ‌న ఎండ‌గ‌ట్టేవారు ఓటుకు నోటు త‌ర్వాత‌... ఇక  ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధానిని వ‌దిల ఏకంగా ఏపీ పాల‌న అంతా క‌ర‌క‌ట్ట‌కు వ‌చ్చింది  ఈ కేసుతో. 
 
అలాగే తెలంగాణాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి-కాంగ్రెస్ మ‌ధ్య పొత్తుంటుంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారం కూడా కెసిఆర్ కు కంటిమీద నిద్ర‌లేకుండా చేస్తోంది. త‌న‌ను రాజ‌కీయంగా దెబ్బ‌కొట్ట‌టానికే చంద్ర‌బాబు కాంగ్రెస్ తో క‌లుస్తున్నార‌ని కేసీఆర్ అనుమానిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ ను దెబ్బ‌కొట్ట‌టానికి కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ అంద‌రికీ తెలిసిందే. కేసీఆర్ ను కాంగ్రెస్ ఎక్క‌డిక‌క్క‌డ ఢీ అంటే ఢీ అంటోంది రాజ‌కీయంగా...
 
ఇటువంటి ప‌రిస్దితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి-కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకుంటే కెసిఆర్ కు ఇబ్బందే అన‌టంలో సందేహం లేదు. ఇక కాంగ్రెస్ నాయ‌కులు తెలుగుదేశం నాయ‌కులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్  పై క‌లిసి పోటీ చేయ‌నున్నాయి... ఇప్పుడు రేవంత్ కూడా కాంగ్రెస్ లో చేరారు... దీంతో ఈ కేసు కేసీఆర్ సీరియ‌స్ గా తీసుకుని ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారు అని అంటున్నారు... అలాగే విచార‌ణ నోటీసులు అందుతాయా అంటే వేచి చూడాలి.... నోటీసులు అందితే ఇక అస‌లైన రాజ‌కీయ క్రీడ  బ్రీఫుడ్ మీ వాయిస్ విష‌యం తేలిపోయిన‌ట్టే. ఇక స్టేలు వ‌చ్చే ప‌రిస్దితి ఎలాగో లేదు అనే విష‌యం తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.