క‌డ‌ప‌లో ఎల్లో వార్ 10 మంది రాజీనామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-04 10:28:27

క‌డ‌ప‌లో ఎల్లో వార్ 10 మంది రాజీనామా

అధికార తెలుగ‌దేశం పార్టీలో విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య ఆధిపత్య పోరు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు క‌డ‌ప టీడీపీలో ఇళ్ల ప‌ట్టాల భాగోతం విష‌యంలో అధికారుల‌కు, నేత‌ల‌కు మ‌ధ్య వివాదం  నెల‌కొంది. 
 
క‌డ‌ప‌ నగరంలో ఇళ్లస్థలాల పంపిణీలో జరిగిన అవకతవకలపై కలెక్టర్ బాబూరావు నాయుడు సీరియస్ అయ్యారు. నిజా నిజాలు తెల‌సుకునేందుకు  విచారణకు ఆదేశించారు. ఈ వ్య‌వ‌హారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పోరేట‌ర్లు భారీ కుంభ‌కోణానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 
 
విచార‌ణ‌లో ఇరుక్కుంటామ‌నే ముంద‌స్తు జాగ్ర‌త్త‌తో  అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న  తెలుగు త‌మ్ముళ్లు రాజీనామాస్త్రాలు సంధించారు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా టీడీపీ నేత‌లు కార్పోరేట‌ర్ల‌ను బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.