బాబు వల్ల‌ కేఈ నిర్ణ‌యం మార్చుకుంటారా..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu and ke krishna murthy
Updated:  2018-10-08 10:49:15

బాబు వల్ల‌ కేఈ నిర్ణ‌యం మార్చుకుంటారా..

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఏపీ రాజ‌కీయాలు భ‌గ్గుమంటున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ, లేక టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన, ఇలా ఏ కోణంలో చూసినా ఏపీ రాజ‌కీయాలు ఓ రేంజ్ లో వేడెక్కుతున్నాయి. అయితే ఇదే క్ర‌మంలో టీడీపీ నాయ‌కుల‌కు కాంగ్రెస్ లీడ‌ర్స్ కు మ‌ధ్య మాట‌ల యుద్దం ఒక రేంజ్ లో సాగుతోంది. తెలుగు రాష్ట్రాలు విభ‌జించినందున ప్ర‌స్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోమాలో చేరుకుంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోమానుంచి బ‌య‌ట‌కు రావాల‌ని పార్టీ నాయ‌కులు తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. 
 
ఇదే క్ర‌మంలో 2019లో మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్న టీడీపీ అధిష్టానం.  అధికారంలోకి రావాలంటే వైసీపీని టార్గెట్ ను చేస్తుంది. అయితే ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ కు వ‌స్తున్న ప్ర‌జా మ‌ద్ద‌తును చూసిన‌ టీడీపీ అధిష్టానం ఒంట‌రిగా జ‌గ‌న్ డీ కొట్ట‌లేమ‌నే ఉద్దేశంతో తెలంగాణ‌తో పాటు  ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రెడి అవుతుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ పొత్తుల వ్య‌వ‌హారంపై ఇద్ద‌రు బ‌ద్ద‌శ‌త్రువుల నాయ‌కులు ఒరిపై ఒక‌రు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. 
 
అధికార పార్టీకి చెందిన డిప్యూటీ ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ మూర్తి అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి. క‌ర్నూల్ జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాల మ‌ధ్య వైర్యం ఇప్పుడిప్పుడు వ‌చ్చిన‌ది కాదు. దాదాపై 40 సంవ‌త్స‌రాల‌నాటినుంచి ఇరు వ‌ర్గాల మ‌ధ్య ప‌గ‌లు ప్ర‌తికలు కేంద్రంగా ఆదిప‌త్య‌పోరు బ‌గ్గుమంటునే ఉంది.
 
అయితే ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఏపీలో ఉండ‌వ‌చ్చు అన్న చ‌ర్చ మొద‌లైంది. దీంతో కొద్ది కాలంగా వీరిద్ద‌రు మీడియాను వేదిక‌గా చేసుకుని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పెట్టిన పార్టీ తెలుగుదేశంపార్టీ అని అలాంటి పార్టీతో ఎట్టి ప‌రిస్థితిలో పొత్తుపెట్టుకునే ప‌రిస్థి ఉండ‌ని స్ప‌ష్టం చేశారు కేఈ. ఒక వేల పొత్తుపెట్టుకుంటే తాను ఉరి వేసుకుంటాన‌ని సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు ఆయ‌న‌. ఇక ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు కోట్ల తీవ్ర‌స్థాయిలో కేఈ  చేసిన వ్యాఖ్య‌ల‌ను వ్య‌తిరేకించారు. కేఈ గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ‌కీయ అరంగేట్రం చేశాడ‌ని అలాంటి వ్య‌క్తి త‌మ పార్టీని విమ‌ర్శించ‌డం మంచిదికాద‌ని హెచ్చ‌రించారు. 
 
అయితే ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్ టీడీపీ పోత్తు ఓకే అయింది. మ‌రి ఏపీలో కూడా ఇదే బందం కొన‌సాగుతుంద‌ని కొంత‌మంది భావిస్తున్నారు. పొత్తుపెట్టుకుంటే కేఈ ఉరివేసుకుంటాన‌ని అన్నారు మ‌రి ఆయ‌న రియాక్ష‌న్ ఎలా ఉంటుందోన‌ని కొంత‌మంది భావిస్తున్నారు. లేక పార్టీ అధినేత కోరిక మేర‌కు త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటారా అని మ‌రికొంద‌రి వాద‌న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.