బ్రేకింగ్.. కేఈ కుమారుడు శ్యాంబాబు అరెస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ke syam babu
Updated:  2018-10-09 15:42:09

బ్రేకింగ్.. కేఈ కుమారుడు శ్యాంబాబు అరెస్ట్

వ‌రుస జంట హ‌త్య‌ కేసులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉపముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ మూర్తి కుమారుడు శ్యాంబాబు అలాగే ఎస్ఐ నాగ తుల‌సీ ప్ర‌సాద్ ల‌ను అరెస్ట్ చేయాలంటూ న్యాయ‌స్థానం తాజాగా ఆదేశాల‌ను జారీ చేసింది. ప్ర‌తిప‌క్ష  వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త చెరుకుల‌పాడు నారాయ‌ణ రెడ్డి, ఆయ‌న డ్రైవ‌ర్ సాంబ‌శివుడు హ్య‌త‌కేసులో వీరిద్ద‌రిని నిందితులుగా చేర్చాలంటూ చెరుకుల‌పాడు నారాయ‌ణ రెడ్డి భార్య‌, కంగాటి శ్రీదేవి 2017లో డోన్ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. 
 
ఆమె వేసిన పిటీష‌న్ను న్యాయస్థానం ప‌రిశీలించి శ్యాంబాబును, నాగ తుల‌సీ ప్ర‌సాద్ ల‌ను అరెస్ట్ చెయ్యాల‌ని అప్ప‌ట్టో కోర్లు ఆదేశాల‌ను జారీ చేసింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు ఉమ్మ‌డి హైకోర్టును ఆశ్ర‌యించి స్టే తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఈ స్టే గ‌డువు మూగియ‌డంతో శ్యాంబాబును, నాగ తుల‌సీ ప్ర‌సాద్ ల‌ను అరెస్ట్ చేయ్యాలంటూ న్యాయ‌స్థానం ఆదేశాలు జారీ చేసింది.  
 
నిత్యం ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ, ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ వ‌చ్చిన  చెరుకుల‌పాడు నారాయ‌ణ రెడ్డికి అధిక సంఖ్య‌లో ప్ర‌జా ధ‌ర‌ణ వ‌స్తుంద‌ని గ్ర‌హించి ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న‌ను అత్యంత పాశ‌వికంగా వేట‌కొడ‌వ‌ళ్ల‌తో న‌రికి చంపిన ఘ‌ట‌న అంద‌రికి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.