ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి కొత్త పేరు పెట్టిన కేఈ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-22 17:20:34

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి కొత్త పేరు పెట్టిన కేఈ

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, కేఈ కృష్ణ‌మూర్తి ఈ మధ్య కాలంలో ఇటు ప్ర‌తిక్ష వైసీపీ నేల‌త‌పై, అటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విమ‌ర్శ‌లు చేస్తూ తాజాగా వార్త‌లో నిలుస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో కొద్దిరోజ‌ల క్రితం కేఈ కృష్ణ మూర్తి  మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేయ‌నున్నారనే విష‌యంపై స్పందించారు
 
తాము ఎట్టి ప‌రిస్థితిలో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకుని పోటీ చేయ‌మ‌ని ఒకవేళ‌ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే తాను ఉరి వేసుకుని చ‌చ్చిపోతాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా కేఈ సేమ్ ఇలాంటి విమ‌ర్శ‌లు చేసి  మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఈ రోజు అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే గాలి అని సెటైర్స్ వేశారు.
 
ఆయ‌న ఎప్పుడు గాలి వార్త‌ల‌ను న‌మ్మ‌డం త‌ప్ప వేరే ఆలోచ‌నలు ఉండ‌వ‌ని కేఈ విమ‌ర్శించారు. ప‌వ‌న్ చేసే విమ‌ర్శ‌ల్లో శ‌క్తి లేద‌ని ఆయ‌న స్ప ష్టం చేశారు. పవన్‌ ఒక అజ్ఞాతవాసి అని రీల్‌ లైఫ్ రియల్‌ లైఫ్‌ వేరని ఆ విష‌యాన్నిఆయ‌న గుర్తించాల‌ని అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదవటం ఆయనకు అలవాటైందని అన్నారు. ప్రజా క్షేత్రంలో ఉండేవారు బాధ్యతగా మెలగాలి కానీ తప్పుడు ప్రచారాలు చేయకూడద‌ని కేఈ సూచించారు. అమ‌రావ‌తి నిర్మాణం కోసం రైతులు స్వ‌చ్చందంగా భూములు ఇచ్చార‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఈ విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు. రాజధానిలో పవన్‌ పర్యటిస్తే అక్కడి ప్రజలే బుద్ధి చెబుతారని కేఈ  అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.