చంద్ర‌బాబును ముప్పు తిప్ప‌లు పెడుతున్న కేఈ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-27 17:31:35

చంద్ర‌బాబును ముప్పు తిప్ప‌లు పెడుతున్న కేఈ

2019 ఎన్నిక‌లు దగ్గ‌రు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ ఏంపీలు ఎమ్మెల్యేలు ప్ర‌స్తుతం గాడి త‌ప్పి పార్టీ అధినేత నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో పొత్తుపెట్టుకుని ముందుకుసాగాల‌ని భావిస్తున్న త‌రుణంలో పార్టీ నాయ‌కులు ఈ విష‌యాన్ని వ్య‌తిరేకింస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి డిప్యూటీ ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ మూర్తి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకునే వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకునే ప్ర‌స‌క్తే లేద‌ని  స్ప‌ష్టం చేశారు. టీడీపీ జాతీయ పార్టీ అని ఇత‌ర రాష్ట్రాల్లో పొత్తులు ఏవిధంగా ఉన్నా కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారన్నది తమ మనసులలో నాటుకుపోయిందని, కింది స్థాయి కేడర్ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని అన్నారు
 
అయితే ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పొత్తుల వ్య‌వ‌హారం మంత్రులుపై ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌లో ఎలాంటి చ‌ర్చ జ‌రుగ‌కుండానే ఎందుకు మంత్రులు మాట్లాడుతున్నార‌ని అన్నారు. పొత్తులకు సంబంధించి టీడీపీ పొలిక‌ల్ బ్యూరో నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న విష‌యం కూడా మంత్రులుకు తెలియ‌దా అని క్లాస్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే చంద్ర‌బాబు నాయుడు క్లాస్ తీసుకున్నా కూడా మంత్రి పొత్తుల విష‌యాన్ని మ‌రోసారి స్పందించ‌డం ఏంట‌ని టీడీపీ నాయ‌కులు మ‌ద‌న ప‌డుతున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.