నేను క‌చ్చితంగా ఉరి వేసుకుంటా..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-06 18:33:47

నేను క‌చ్చితంగా ఉరి వేసుకుంటా..

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ మూర్తి మ‌రోసారి టీడీపీ కార్యాలాయంలో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాము ఎట్టిప‌రిస్థితిలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని పోటీ చేయ‌మ‌ని, ఒక వేళ‌ చేసిన‌ట్లు అయితే తాను క‌చ్చితంగా ఉరి వేసుకుంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
ఎట్టి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తే లేద‌ని ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో తాము ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని కేఈ అన్నారు. అయితే ఇది నా వ్య‌క్తిగ‌తం కాద‌ని, పార్టీ త‌రుపునే చెబుతున్నాన‌ని కేఈ కృష్ణమూర్తి స్ప‌ష్టం చేశారు.
 
అలాగే జిల్లాలో బీసీలపై కేఈ కుటుంబం పెత్తనం సాగిస్తున్నార‌నే వార్త‌ల‌పై కూడా ఆయ‌న స్పందించారు. తాము జిల్లాలో ఏ కుల‌స్తుల‌పై పెత్త‌నం చ‌లాయించ‌డం లేద‌ని, తాము అంద‌రితో క‌లుపుగోలుగా ఉంటామ‌ని అన్నారు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసే మందు వాస్త‌వాల‌ను తెలుసుకుని ఎవ‌రైనా మాట్లాడాల‌ని స్ప‌ష్టం చేశారు.
 
తాను ప్ర‌జ‌ల ఆదరణతోనే రాజకీయంగా ఎదిగాన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ప్ర‌జ‌ల అండ‌తోనే గెలుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మీడియాలో త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణ‌లు వెంట‌నే ఆపాల‌ని ఎవ‌రికైనా ద‌మ్ము ధైర్యం ఉంటే త‌న కుటుంబంతో పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాల్ విసిరారు కేఈ కృష్ణ మూర్తి.  తాము ఎట్టి ప‌రిస్థితిలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోమ‌ని , ఇవ‌న్ని క‌ల్పిత‌మైన వ్యాఖ్య‌ల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.