కాళ్లు ప‌ట్టుకున్నా స‌రే పోత్తుకు నో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu and ke krishna murthi
Updated:  2018-08-24 05:51:15

కాళ్లు ప‌ట్టుకున్నా స‌రే పోత్తుకు నో

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి మ‌రోసారి 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ పొత్తుల‌పై  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేపు క‌ర్నూల్ జిల్లాలో పార్టీ నాయ‌కులు ధ‌ర్మ పోరాట స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో కేఈ, పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు వ‌చ్చారు.
 
ప‌నుల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని ఎట్టి ప‌రిస్థితిలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న కుండ బ‌ద్ద‌లు కొట్టారు.
 
పొత్తుల కోసం కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు త‌మ కాళ్లు ప‌ట్టుకున్నా కూడా తాము పొత్తుకు అంగీకరించ‌మ‌ని కేఈ స్ప‌ష్టం చేశారు. కాగా గతంలో కూడా కేఈ  మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తాను ఉరి వేసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. 
 
ఇక‌ ఇదే క్ర‌మంలో మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు అయ్య‌న్న పాత్రుడు నిన్న ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్ర‌జ‌లు కొడ‌తార‌ని తాను ఈ పొత్తును వ్య‌తిరేకిస్తాన‌ని చెప్పిన విదిత‌మే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.