రచ్చకెక్కిన విభేదాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mini mahanadu
Updated:  2018-05-14 17:50:03

రచ్చకెక్కిన విభేదాలు

1994 నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌గా పిలువ‌బ‌డుతున్న‌ క‌ర్నూల్ జిల్లా ప‌త్తికొండ నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌స్తుతం ఈ కంచుకోట‌కు బీట‌లు వాలే ప‌రిస్థితి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేఈ కృష్ణ‌మూర్తి త‌న ప్ర‌త్య‌ర్థిపై పోటీ చేసి అతి స్వ‌ల్ప మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చారు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితిని బ‌ట్టి చూస్తుంటే ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ అభ్య‌ర్థిపై ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక మెజారిటీతో గెలిచే ఛాన్స్  ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది.
 
ఇక దీనికి తోడు తాజాగా తెలుగుదేశం పార్టీ ప‌త్తికొండ‌ ఇంచార్జ్  కేఈ శ్యాంబాబు ఆధ్వ‌ర్యంలో మినీ మహానాడు కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్ర‌భాక‌ర్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక వీరితో పాటు శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఇంత‌కు ముందే చేరుకున్న కేఈ ప్ర‌భార్ తుగ్గ‌లి నాగేంద్ర‌ను చూసి త‌న వాక్చాతూర్యంతో ఏదో ఒక మాట లోలోప‌లే తిట్టుకున్నారు. ఇక ఆయ‌న మాట‌ల‌ను గ‌మ‌నించిన తుగ్గలి నాగేంద్ర కేఈ పై త‌న‌ధైన శైలిలో మాట‌లు పేల్చారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం సాగింది.
 
ఇక ఈ క్ర‌మంలో కే.ఈ ప్ర‌భాక‌ర్ తుగ్గ‌లి నాగేంద్ర‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డంతో అక్క‌డ వాతావ‌ర‌ణం ఉదృక్తతకు దారి తీసింది. ఈ నేప‌థ్యంలో కేఈకు వార్నింగ్ ఇస్తూ ఏయ్‌ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు అని తుగ్గిలి నాగేంద్ర హెచ్చరించారు. దీంతో స‌భ మొత్తం ర‌చ్చ‌రంబోలా అయింది. ఈ క్ర‌మంలో స‌భ అధ్య‌క్షులు శ్యాంబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వారిని శాంతింపచేయ‌డంతో అక్క‌డి ప‌రిస్థితి కాస్థ స‌ర్దుముఖం ప‌ట్టింది.
 
ఈ స‌భ‌లో వీరిద్ద‌రు ఒక‌రి ప్ర‌క్క ఒక‌రు కూర్చోవ‌డంతో  ఈ గొడ‌వ అంతటితో ఆగకుండా సమావేశం ముగిసే వరకు మధ్య మధ్యలో వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.  ఈ క్ర‌మంలో ఎమ్మెల్సీ ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆరు నురైనా తెలుగుదేశం పార్టీ త‌ర‌పున శ్యాంబాబు పోటీ చేస్తార‌ని అందుకుకోసం త‌మ ర‌క్తాన్ని చిందించి అయినా క‌ష్ట‌ప‌డ‌తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కొంత కాలంగా ప‌త్తికొండ‌లో  ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని ఇక్కడికి ఎవరూ రారని అన్నారు. కేవ‌లం శ్యాంబాబు మాత్ర‌మే పోటీ చేస్తార‌ని తెలిపారు.
 
2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తానుపోటీ చేసిన‌ప్పుడు టీడీపీకి 23 ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చిందని, 2014లో వైఎస్సార్ సీపీకి 240 ఓట్లు మెజార్టీ వచ్చిందని ఇక్కడ ఎవరూ ఏమీ పొడిచింది లేదంటూ ప‌రోక్షంగా తుగ్గ‌లి నాగేంద్ర‌ను ఉద్దేశించి కేఈ ప్ర‌భాక‌ర్ విమ‌ర్శించారు. వాస్త‌వంగా చెప్పాలంటే తుగ్గ‌లి నాగేంద్ర లేకుంటే 2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కానీ, 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కానీవండి నాగేంద్ర‌ లేకుంటే టీడీపీ గెల‌వ‌డం క‌ష్ట‌త‌రంగా మారుతాదని అక్క‌డ జ‌నాలు చెబుతున్న మాట‌. 
 
ప‌త్తికొండ ప‌రిధిలో ఐదు మండ‌లాలు ఉన్నాయి. అందులో తుగ్గ‌లి నాగేంద్ర ప‌రిధిలో రెండు (తుగ్గ‌లి, మ‌ద్దికేర‌) మండ‌లాలు ఉన్నాయి. ఈ రెండు మండ‌లాల ప్ర‌జ‌లు నాగేంద్ర చెప్పిందే వేదం అన్న‌ట్లు భావిస్తారు. మ‌రి ఇంత‌టి నాయ‌కుడిని కేఈ కుటుంబం వ‌దులు కుంటే 2019 సార్వ‌త్రిక ఎన్నిల్లో శ్యాంబాబు నెగ్గ‌డం క‌ష్టత‌రంగా మార‌నుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక మ‌రోవైపు ప‌త్తికొండ ఇంచార్జ్ చేరుకుపాడు శ్రీదేవి కూడా అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని  విస్రృతంగా ప్ర‌చారం చేస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.