మంత్రి ఆది మోసం చేశారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-07 15:09:32

మంత్రి ఆది మోసం చేశారు

కేశవ‌రెడ్డి విద్యా సంస్థలో చ‌దువుకుంటున్నటువంటి  విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో ముంద‌స్తుగా న‌గ‌దును వ‌సూలు చేసి దానికి డిపాజిట్లు స‌మ‌ర్పించారు అధినేత కేశ‌వ‌రెడ్డి.... కొన్ని రోజులుగా వ‌డ్డి చెల్లించిన కేశ‌వ‌రెడ్డి త‌ర్వాత చేతులెత్తేయ‌డంతో డిపాజిట్  బాధితులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేశారు..దీంతో ఈ కుంభ‌కోణం  వెలుగులోకి వ‌చ్చింది.
 
దీని పై ప్ర‌భుత్వం కేశ‌వ‌రెడ్డి పై చ‌ర్య‌లు తీసుకుని క‌స్ట‌డికి త‌ర‌లించింది. విద్యాసంస్థ‌లో జ‌రిగిన అక్ర‌మాల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనీవాస్‌రావు బాధ్య‌త‌ వ‌హిస్తూ బాధితుల‌కు న్యాయం చేస్తామ‌ని హామి కూడా ఇచ్చారు.
 
కేశ‌వ‌రెడ్డి బాధితుల్లో క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బాధితుడు శ్రీనివాస్‌రెడ్డి  మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డిని క‌ల‌సి స‌మ‌స్య‌ను తెలియ‌జేస్తే ఆ డ‌బ్బును తాను చెల్లిస్తాన‌ని హ‌మీ ఇచ్చార‌ట‌.  మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి ప‌లు ద‌ఫాలుగా ల‌క్ష రూపాయలు చెల్లించి మోసం చేశార‌ని బాధిత శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 
 
దీంతో త‌మ‌కు న్యాయం చేయాల‌ని బాధితుడు సీఎం చంద్ర‌బాబును అనేక సార్లు క‌లిసి స‌మ‌స్య‌ను తెలిపినా ప‌రిష్కారం చేయ‌లేద‌ని అన్నారు. దీంతో విసుగు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, ఆయన తన భార్య హైమావతి, ముగ్గురు సంతానంతో కలసి అమ‌రావ‌తి సచివాలయం గేట్‌–2 వద్ద పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు.
 
అక్కడున్న భద్రతా సిబ్బంది దీన్ని గమనించి అడ్డుకుని ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. నెల రోజుల్లో తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించకపోతే కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడతామని  బాధితుడు శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.