కియా పేరుతో మోసం....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 12:29:08

కియా పేరుతో మోసం....

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ కృషితో క‌ర‌వు జిల్లా అనంపురంలో ఏర్పాటు చేయ‌నున్న కియా కార్ల ప‌రిశ్ర‌మ మ‌రో వివాదంలో చిక్కుకుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే సుమారు 15 వేల‌కు పైగా  ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ఏపీ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంది. 
 
అయితే అదే కియా పేరుతో నిరుద్యోగుల‌ను మోసం చేసేందుకు సిద్దమైంది సంస్ధ. అనంత‌పురం జిల్లా పెనుకొండ మండ‌లం అమ్మ‌వారి ప‌ల్లి ప్రాంతంలో ఈ కియా ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేశారు. ఇందులో ఉద్యోగాలు భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే చూస్తోంద‌ని అక్క‌డి అధికారులు చెబుతున్నారు. 
 
దీంతో అక్క‌డ ఎలాగైనా ఉద్యోగం సంపాదించాల‌ని స్ధానిక నిరుద్యోగులు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదే అదునుగా నిరుద్యోగుల‌ను మోసం చేసేందుకు స‌ద‌రు సంస్ధ యాజ‌మాన్యం సిద్ద‌మైంది. కియా ప‌రిశ్ర‌మ‌తో పాటు అనుబంధ సంస్ధ‌లైన యూంగ్ చాంగ్, కుక్ బూ త‌దిత‌ర కంపెనీల‌లో ఉద్యోగాలు ఇస్తామంటూ కియాన్ బ్యాన్ ప‌వ‌ర్ ఏజెన్సీ నిరుద్యోగుల‌కు ఎర‌వేసింది. 
 
అక్క‌డ  కియాకు అనుబంధ సంస్ధ‌లు  ఇంకా ఏర్పాటు చేయ‌క‌ముందే ఉద్యోగా అవ‌కాశాలు అంటూ బోర్డు పెట్ట‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇది తెలియ‌ని ఉద్యోగులు వేల సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు పెడుతున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారంపై అధికారులు దృష్టి సారించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.