కిర‌ణ్ కుమార్ రెడ్డి వారికి ఫోన్ డైల‌మాలు బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-07 18:53:25

కిర‌ణ్ కుమార్ రెడ్డి వారికి ఫోన్ డైల‌మాలు బాబు

ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాలు చివ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి  తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోనున్నారు. ఇందుకు ఈ నెల 13వ తేదిన ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఆయ‌న పార్టీలో చేరేముందు సోనియా గాంధీని అలాగే జాతీయ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహూల్ గాంధీని క‌లుసుకోనున్నారు. వారిని క‌లిసిన త‌ర్వాత 13వ తేదిన రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. 
 
ఇక ఆయ‌న‌తో పాటు ఇత‌ర పార్టీల్లో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయ‌కులను కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువ‌చ్చేందు ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే న‌ల్లారి కిర‌ణ్ కూమార్ రెడ్డి  తెలుగు దేశం పార్టీల్లో చేరిన కాంగ్రెస్ నాయ‌కులకు ఫోన్ చేసి తిరిగి పార్టీలో చేర్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 2019 లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయాలంటే వారితోనే సాధ్యం అవుతుంద‌నే ఉద్దేశ్యంతో ప్ర‌తీ ఒక్క‌రిని త‌న‌ ట‌చ్ లోకి తెచ్చుకుంటున్నారు కిర‌ణ్ కుమార్ రెడ్డి.
 
ఇక ఈ విష‌యం తెలుసుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్రంగా ఆలోచిస్తున్నార‌ట‌. ఎన్నిక‌ల స‌మ‌రానికి 10 నెలలు స‌మ‌యం కూడా లేదు ఇలాంటి స‌మ‌యంలో టీడీపీకి చెందిన కాంగ్రెస్ నాయ‌కులు రీఎంట్రీ ఇస్తే టీడీపీలో గంద‌ర‌గోళం ఏర్ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు నాయుడు స‌త‌మ‌త‌మవుతున్నార‌ట‌. చుద్దాం రానున్న రోజుల్లో టీడీపీలో ఇంకా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.