రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kiran kumar reddy
Updated:  2018-06-19 15:19:22

రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ

ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల చివ‌రి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోపు తిరిగి రాజ‌కీయాల్లోకి రావాల‌ని చూస్తున్నార‌ట‌. ఇందుకోస‌మే త‌న అనుచ‌రుల‌తో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల‌ను కిర‌ణ్ కుమార్ రెడ్డి అడిగి తెలుసుకున్నార‌ట‌. ఇక అనుచ‌రులు కూడా సుముఖంగా స‌మాధానం ఇవ్వ‌డంతో తిరిగి సొంత గూటికి చేరే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. 
 
తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో కిర‌ణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంతంగా స‌మైఖ్యంధ్రా పేరుతో పార్టీ స్థాపించారు. ఆ ఎన్నిక‌ల్లో కిర‌ణ్ కుమార్ రెడ్డి పార్టీకి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది.అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.
 
ఈ క్ర‌మంలో కిర‌ణ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇప్ప‌టికే ఆయ‌న సోద‌రుడు కొద్దిరోజుల క్రితం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఇప్పుడు కిర‌ణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తే కిషోర్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేక టీడీపీలోనే కొసాగుతారా అన్న‌ది పీలేరులో పెద్ద‌చ‌ర్చ‌గా మారుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.