కొడాలి నాని సంచ‌లన కామెంట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 03:32:04

కొడాలి నాని సంచ‌లన కామెంట్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తెలుగుదేశం నాయ‌కుల‌కు  ఎక్క‌డికక్క‌డ  ధీటుగా స‌మాధానాలు చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నారు... ఓ ప‌క్క  జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌జలు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతుంటే, జ‌నాలు రావ‌డం లేద‌ని త‌న ఆస్ధాన మీడియాల‌లో బాబు అండ్ కో ప్ర‌చారం చేస్తోంది.. అయినా జ‌గ‌న్ వీటిని ప‌క్క‌న పెట్టి ప్ర‌జ‌ల‌తో క‌లిసి ముందుకు అడుగువేస్తున్నారు. ఇక తాజాగా జ‌గ‌న్ అవిశ్వాస తీర్మాన ప్ర‌క‌ట‌న తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టింది.
 
దీనిపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యారు.. బాబు అంత దారుణ‌మైన రాజ‌కీయాలు ఎవ‌రూ చేయ‌ర‌ని ఆయ‌న అన్నారు..కేంద్రం చేతిలో బాబు కీలుబొమ్మ‌గా మారారు అని ఇక తెలుగుదేశం పార్టీని ఇక్క‌డ న‌డ‌ప‌టం కంటే బీజేపీలో విలీనం చేయ‌డం మంచిది అని జోస్యం చెప్పారు.. దీంతో తెలుగుదేశం నాయకులు కంగుతిన్నారు. కొద్దిరోజులుగా నాని ఏ విష‌యం పై మాట్లాడ‌టం లేదు తాజాగా నాని లైన్ లోకి రావ‌డంతో తెలుగుదేశం నాయ‌కులు ఎటువంటి కౌంటర్ కు సిద్ద ప‌డ‌టం లేదు.
 
తెలుగుదేశాన్ని బీజేపీలో క‌లిపేస్తే తెలుగుదేశానికి మంచిది అని కౌంటర్ వేశారు కొడాలి నాని... బాబు కేవ‌లం కేసుల‌కు భ‌య‌ప‌డి ఏపీకి ప్ర‌త్యేక హూదాని తాక‌ట్టు పెట్టారు అని అన్నారు... ఇటువంటివి రాజ‌కీయంగా చంద్ర‌బాబుకి వెన్న‌తో పెట్టిన విద్య అని ఆయ‌న అన్నారు... జ‌గ‌న్ అవిశ్వాస తీర్మానం అని చెప్పేస‌రికి తెలుగుదేశం అధినేత‌కు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి అని ఆయ‌న ఫైర్ అయ్యారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.