కొడాలి నాని పిలుపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-07 16:26:02

కొడాలి నాని పిలుపు

వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర కృష్ణా జిల్లాలో నిర్విరామంగా పెద్ద ఎత్తును ప్ర‌జామ‌ద్ద‌తుతో జ‌రుగుతోంది.. 155వ రోజు పాదయాత్ర జ‌గ‌న్ ప్రారంభించారు....నేడు కొడాలి నాని సెగ్మెంట్లో జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రుగ‌నుంది. ఇక అక్క‌డ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు వైసీపీ నాయ‌కులు.
 
నేడు సాయంత్రం గుడివాడ పట్టణంలోని నెహ్రూ చౌక్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు.... సోమవారం ఉదయం గుడ్లవల్లేరు మండలంలోని కవిరాజ నగర్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమై గుడివాడ మండలం సిద్దాంతం  మీదుగా బొమ్ములూరు చేరుకుని అక్క‌డ నుంచి బొమ్ములూరు శివారు లారీ స్టాండ్‌ వద్ద మధ్యాహ్నం బస ఉంటుందని చెప్పారు.
 
అక్కడ నుంచి మార్కెట్‌ యార్డు పెద్దకాలువ సెంటర్‌ మీదుగా గుడివాడ చేరుకుని గుడివాడ నెహ్రూ చౌక్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.  
 
ఇప్ప‌టికే జ‌గ‌న్ వెంట జిల్లా నాయ‌కులు కొడాలి నాని త‌దిత‌ర ఎమ్మెల్యేలు క‌లిసి న‌డుస్తున్నారు ఇక కొడాలి నానికి పొలిటిక‌ల్ గా మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది.. ఇక గుడివాడ‌లో ఇరువురి పొలిటిక‌ల్ స్పీచ్ ఎలా ఉండ‌బోతోందో అని నాయ‌కులు ప్ర‌జ‌లు తెలుగుదేశం నాయ‌కులు కూడా ఎదురుచూస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.