కోర్టెక్కిన దుర్గ‌గుడి వివాదం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kodela surya latha
Updated:  2018-08-23 03:16:37

కోర్టెక్కిన దుర్గ‌గుడి వివాదం

విజ‌య‌వాడ క‌న‌క దుర్గ‌మ్మ ఆల‌యంలో చీర మాయం కేసులో ట్ర‌స్ట్ మెంబ‌ర్ కోడెల సూర్య‌ల‌త కుమారి తాజాగా హైకోర్టును ఆశ్ర‌యించారు. చీర మాయం వ్య‌వ‌హ‌రం నుంచి త‌న‌ను ట్ర‌స్ట్ బోర్డ్ మెంబ‌ర్ నుంచి తొల‌గించార‌ని స‌వాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే ఈమె వేయించిన పిటీష‌న్‌ను ప‌రిష్కరించిన హైకోర్టు దుర్గ గుడి ఈవో ప్రిన్సిప‌ల్ సెక్రెట్రీ ఎండోన్మెంట్ ట్రస్ట్ బోర్డ్ కు నోటీసుల‌ను జారీ చేసింది. 
 
నాలుగు వారాల్లోపు పూర్తి నివేదిక స‌మ‌ర్పించాల‌ని హైకోర్టు ఆదేశాల‌ను జారీ చేసింది. ఇక త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ధ‌ర్మాస‌నం తెలిపింది. గ‌తంలో తాను చీర దొంగ‌లించానంటు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఎవ‌రైనా కూడా భ‌హిరంగ స‌భ‌కు రావాల‌ని స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే.

షేర్ :

Comments