బ్రేకింగ్- దుర్గ‌గుడిలో లైంగిక వేధింపులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijayawada durga temple
Updated:  2018-08-18 13:27:22

బ్రేకింగ్- దుర్గ‌గుడిలో లైంగిక వేధింపులు

విజ‌య‌వాడ దుర్గ‌గుడి మాజీ పాల‌క మండ‌లి స‌భ్యురాలు కోడెల సూర్య‌ల‌త ఈ రోజు మీడియా ద్వారా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొద్ది కాలంగా దుర్గ గుడిలో మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఆల‌యానికి చెందిన పాల‌క‌మండ‌లి స‌భ్యుడు వెల‌గ‌పుడి శంక‌ర‌బాబు OPDS కు చెందిన మ‌హిళ‌ల ప‌ట్ల లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.
 
గుడిలో ప‌నిచేసే మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేస్తూ వారిని లైంగికంగా లొంగ దీసుకుంటున్నార‌ని సూర్య‌ల‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు గతంలో శంక‌రబాబు పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సుమారు ఐదుగురు మ‌హిళ‌లు చైర్మ‌న్ కు లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు అని ఆమె తెలిపారు. అయితే వెల‌గ‌పుడిని చైర్మ‌న్ వెనుక వేసుకుని వ‌స్తున్నార‌ని ఆమె ఆరోపించారు.
 
సీసీ రోడ్లో 9 కోట్లు మూడుకోట్ల ఘాట్ రోడ్ల ప‌నుల్లో అక్ర‌మాలు జరిగాయి అన్నారు. చైర్మ‌న్ త‌నకు అనుకూల‌మైన సంస్థ‌కు సెక్యూరిటీ టెండ‌ర్ల‌ను ఇప్పించుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని అయితే దానిని వ్య‌తిరేకంచినందుకు త‌నపై క‌క్ష క‌ట్టార‌ని సూర్య‌ల‌త స్ప‌ష్టం చేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.