వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యే రీఎంట్రీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 11:15:41

వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యే రీఎంట్రీ

తెలుగుదేశం ఎమ్మెల్యేలు సరిప‌డా కోర‌మ్ ఉన్నా, వైసీపీ ఎమ్మెల్యేల‌కు గాలం వేసి. సైకిల్ పార్టీలోకి చేర్చుకున్నారు తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు.. అయితే ఆ  ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చివ‌ర‌కు ప‌ద‌వులు లేవు -ప‌నులు లేవు... తెలుగుదేశంలో  బాబు మాట వింటూ, అసంతృప్తితో పార్టీలో కొన‌సాగుతున్నారు ఫిరాయింపు అనే ట్యాగ్ లైన్ త‌గిలించుకుని నాయ‌కులు.
 
అయితే కక్క‌లేక మింగ‌లేక అనే చందంగా ఏ నాయ‌కుడూ తాము అన‌వ‌స‌రంగా పార్టీ మారాము అని బ‌హిరంగంగా చెప్ప‌లేక‌పోతున్నారు.. అయితే మంత్రి ప‌ద‌వులు వ‌చ్చిన ఫిరాయింపు నాయ‌కులు మిన‌హా, మిగిలిన‌వారు అంద‌రూ అసంతృప్తితోనే కొన‌సాగుతున్నారు సైకిల్ పార్టీలో.. ఇటీవ‌ల అలా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పై ప్ర‌జ‌లు కూడా కోడిగుడ్లు విస‌ర‌డం, ప్ర‌జాక్షేత్రంలోకి వ‌స్తే నిల‌దీయ‌డం జ‌ర‌గ‌డంతో వారి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతోందో అనే డైల‌మాలో ఉన్నారు ఆ నాయ‌కులు.
 
ఇక తాజాగా కొడుమూరు ఎమ్మెల్యే త‌న గ‌ళం విప్పారు.. ఆయ‌న అసంతృప్తి తాజాగా బ‌య‌ట‌పెట్టారు.  తాను తెలుగుదేశానికి అమ్ముడుబోయిన ఎమ్మెల్యే అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు.. త‌న‌కు అబ‌ద్దాలు చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు అన్నారు ఆయ‌న‌.. అంద‌రూ ముఖ్య‌మంత్రి చేసే అభివృద్ది చూసి పార్టీ మారాము అని చెబుతున్నారు తన‌కు  అలా అబ‌ద్దాలు చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు అన్నారు ఎమ్మెల్యే  మ‌ణిగాంధీ.
 
జిల్లాలో వైసీపీ హావాతో గెలిచా, ఇక్క‌డ కొడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలో 53 వేల ఓట్ల మెజార్టీతో గెలిచా, ఈ గెలుపు మెజార్టీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ అని అన్నారు ఆయ‌న... తెలుగుదేశం పార్టీలో చేరి త‌ప్పు చేశాను అని అన్నారు.. త‌న రాజ‌కీయ జీవితానికి తానే ఎండ్ కార్డ్ వేసుకున్నా అని మ‌ద‌న‌ప‌డ్డారు మ‌ణిగాంధీ. 
 
తెలుగుదేశం పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కం అని భావించే స‌భ్య‌త్వాల కోసం 13.50 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లించా, కాని త‌న కార్య‌క‌ర్త‌ల‌కు ఇంకా స‌భ్య‌త్వ కార్డులు ఇవ్వ‌లేదు అని ఆయ‌న వేద‌న చెందారు... కొడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ గా ఉన్న విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి అనుచ‌రులు వాటిని  దొంగిలించారు అని అన్నారు.. ఇక ఇద్ద‌రు తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్నారు అనే సీక్రెట్ ను ఆయ‌న బ‌హిర్గ‌తం చేశారు. ఆరు నెల‌ల్లో రాజ‌కీయాల్లో పెను మార్పులు వ‌స్తాయి అని ఆయ‌న తెలియ‌చేశారు.విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి పనిచేసే సమస్యే లేదని..పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదన్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. Please put a video on it

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.