జేసీ కుటుంబానికి ఎదురుదెబ్బ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-19 16:18:36

జేసీ కుటుంబానికి ఎదురుదెబ్బ

అనంతపురం జిల్లాలో బలమైన నాయక గనం కలిగిన జేసీ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది.జేసీకి అత్యంత ప్రధాన అనుచరుడు అనంతపురం మాజీ కార్పొరేటర్ కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి జేసీకి షాకిచ్చారు.తన అనుచరులతో క‌లిసి పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సమ‌క్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు.
 
గతంలో విద్యార్ధి నాయకునిగా, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకునిగా పనిచేశారు.. అనంతపురం నగరంలో గట్టి పట్టున్న కోగటం ఎన్నో ఏళ్లుగా జేసీకి వెన్నంటే ఉన్నారు.గతంలో జేసీ కష్టకాలంలో ఉన్నప్పుడు అయన వెన్నంటే నడిచారు కోగటం, జేసీ అనుచరులు ఎంత  మంది దూరం అయినా సరే జేసీ ఫ్యామిలీని నమ్ముకుని వారి వెంటే నడిచారు ఆయన.
 
జేసీ ని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా ఉన్న, ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోగా, ఈ మధ్యకాలంలో జరిగిన ఓ భూ వివాదంలో కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి ప్రత్యర్థి వైపు జేసీ పవన్ నిలబడడంతో ఆయన జీర్ణించుకోలేకపోయారు...ఎన్నో ఏళ్లుగా జేసీ ఫ్యామిలీని నమ్ముకుని ఉన్నందుకు తగిన బుద్ది చెప్పారని కోగటం తన అనుచరుల దగ్గర చెప్పుకున్నారని సమాచారం.
 
అనంతపురంలో టీడీపీలో జరుగుతున్నఆధిపత్య పోరుతో ఒక్కొక్కరు టీడీపీని వీడుతుంటే.. వైసీపీ మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఇప్పటికే అనంతపురం నియోజకవర్గం ఇంచార్జి గా ఉన్న అనంత వెంకట్రామి రెడ్డి అందరితో కలుగోలుగా ఉంటూ ముందుకు సాగుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు...ఇలాంటి సమయంలో గట్టి వర్గం కలిగిన కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి వైసీపీలో చేరిక‌తో అనంత నగరంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.