కొమ్మినేని చెప్పింది నిజమే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-30 12:53:21

కొమ్మినేని చెప్పింది నిజమే

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై ప్రముఖ తెలుగు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఆయన తన కొమ్మినేని ఇన్ ఫో వెబ్ సైట్ ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై అసహనాన్ని వ్యక్తం చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర సోమవారానికి వెయ్యి కిలో మీటర్ల మైలు రాయి దాటింది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, నవరత్నాలను వివరిస్తూ ముందుకు సాగుతున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ క్రమంలో వెయ్యి కిలో మీటర్లు మైలు రాయిని చేరుకున్న సందర్భంగా.... రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తు వాక్ విత్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈనాడు, జ్యోతి పత్రికలలో మొదటి పేజీలలో ఎక్కడ జగన్ వెయ్యికిలోమీటర్ల పాదయాత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదు.

చంద్రబాబు చెప్పిన విషయాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోయినా, జగన్ కు సంబంధించిన పాదయాత్ర ప్రస్తావన తీసుకు రాకపోవడం ద్వారా తాము తెలుగుదేశం కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని ఈ పత్రికలు చాలా స్పష్టంగా చెబుతున్నాయని అనుకోవాలా...? అంటూ కొమ్మినేని సదరు పత్రికలపై మండపడ్డారు. కొమ్మినేని చెప్పింది నిజమే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.