అక్క‌డే పోటీ చేస్తా..గెలుస్తా...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 12:47:05

అక్క‌డే పోటీ చేస్తా..గెలుస్తా...

గ‌త కొన్ని రోజులుగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మార‌తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం కొన‌సాగుతూనే ఉంది. వాటిని వైసీపీ ఎమ్మెల్యేలు ఖండిస్తూనే వ‌స్తున్నారు. ఇప్పుడు ఈ వ‌రుస‌లో  బాప‌ట్ల‌  ఎమ్మెల్యే కోన ర‌ఘ‌ప‌తి  కూడా  చేరిపోయారు. ర‌ఘుప‌తి పార్టీ మారుతున్న‌ట్లు ఇప్పుడు జోరుగా  ప్ర‌చారం సాగుతోంది. 
 
కోన ర‌ఘ‌ప‌తి  బుధ‌వారం  మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి పార్టీ మార్పుపై స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అయన తెలిపారు. ఇలాంటి వార్తలు గతంలో కూడా చాలాసార్లు వచ్చాయని,  ఎన్నికలు దగ్గర పడుతున్న క్ర‌మంలో  టీడీపీ చౌకబారు వార్తలను ప్రచారం చేస్తోందని అయన మండిప‌డ్డారు . 
 
వ‌చ్చే ఎన్నికలో బాపట్ల నుంచే తాను వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తానని,  తిరిగి  ఎమ్మెల్యేగా గెలుస్తానని అయన ధీమా వ్య‌క్తం చేశారు .వచ్చే ఎన్నికలో వైసీపీ దే అధికారమని,  ప్రభుత్వము రాగానే బాపట్ల ను నల్లమడ జిల్లాగా ఏర్పాటు చేయించేలా కృషి చేస్తానని అయన ప్ర‌క‌టించారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.