విశాఖ‌లో టీడీపీకి బిగ్ షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp chandrababu naidu
Updated:  2018-06-14 17:01:35

విశాఖ‌లో టీడీపీకి బిగ్ షాక్

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు టీడీపీలో చేరిన ప్ర‌తీ ఒక్క‌రిని పార్టీ త‌ర‌పున పోటీ చేయించారు. అయితే ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీని న‌మ్ముకున్న వారికి సీటు ఇవ్వ‌కుండా  గ‌డిచిన‌ ఎన్నిక‌ల్లో నిరాశ చేకుర్చారు చంద్ర‌బాబు.అంతే కాదు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుల‌కు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా సీటు క‌ల్పిస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. దీంతో వారు గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీకి స‌పోర్ట్ చేశారు. 
 
అయితే ఈ క్ర‌మంలో 2019ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు రానే వ‌చ్చాయి కానీ చంద్ర‌బాబు మాత్రం సీనియ‌ర్ టీడీపీ నాయ‌కుల గురించి ఉలుకు ప‌లుకు లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దీంతో వారు టీడీపీలో ఉంటే త‌మ‌కు ఎదుగుద‌ల ఉండ‌ద‌ని భావించి, ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని చంద్ర‌బాబు నాయుడు వారికి షాక్ ఇవ్వ‌క ముందే వారు టీడీపీకి గుబై చెప్పి చంద్ర‌బాబును షాక్ కు గురిచేస్తున్నారు.
 
అందులో ముఖ్యంగా విశాఖ అర్బన్ కు చెందిన జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు కోన తాతారావు త్వ‌ర‌లో సైకిల్ ను వీడి వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాజా స‌మాచారం మేర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ లో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
2014 సార్వ‌త్రిక ఎన్నికల్లో త‌న‌ను కాద‌ని చంద్ర‌బాబు నాయుడు వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి గాజువాక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో తాతారావు  షాక్ తిన్నారు. అంతే కాదు 2019లో ఖ‌చ్చితంగా నీకు టికెట్ ఇస్తాన‌ని చెప్పారు. అయితే ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు త‌న‌కు టికెట్ ఇవ్వ‌ర‌ని తెలియ‌డంతో మెల్ల‌గా పార్టీ నుంచి జారుకోవ‌డానికి ప్రయ‌త్నాలు చేస్తున్నారు. 
 
త్వరలో విశాఖలో జరిగే పవన్ ప్రజా పోరాటయాత్రలో కండువా కప్పేసుకునేందుకు తాతారావు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఆయ‌న పార్టీ మారితే ఖచ్చితంగా వ‌చ్చేఎన్నిక‌ల్లో విశాఖ‌లో టీడీపీ గెలుపు క‌ష్టంగా మార‌నుంది. 
 
ఎందుకంటే విశాఖలో రాజ‌కీయ నాయ‌కులు నువ్వెంత అంటే నువ్వెంత అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తారు. ఇక ఈ సంద‌ర్భంలో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుడుగా ఉన్న తాతారావు పార్టీ మార‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి గెలుపు క‌ష్ట‌త‌రంగా మార‌వ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.