కొణతాల లైన్ క్లియ‌ర్ త్వ‌ర‌లో వైసీపీలోకి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-29 12:04:41

కొణతాల లైన్ క్లియ‌ర్ త్వ‌ర‌లో వైసీపీలోకి

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌ రాయ‌ల‌సీమ‌ నాలుగు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ఎప్పుడైతే  కోస్తాంధ్ర‌లోకి జ‌గ‌న్ అడుగు పెట్టారో అప్ప‌టి నుంచి విప‌రీతంగా వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరిగిపోతున్నాయి. ఇక ఈ వ‌ల‌స‌లును ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కంట్రోల్ చేసేందుకు శ‌త‌ విధాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీలోకి వ‌ల‌స‌లు మాత్రం ఆగ‌డం లేదు.
 
అయితే ఇప్ప‌టికే టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులంద‌రూ మూకుమ్మ‌డిగా వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.  2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ త‌మ‌కు సీటు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదు కానీ తాము మాత్రం వైసీపీలోకి చేరుతామంటూ కుండ బ‌ద్దలు కొడుతున్నారు సీనియ‌ర్స్. ఒక విధంగా చెప్పాలంటే ప్ర‌స్తుతం టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కులు నూటికి 80 శాతం మంది వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. మిగిలిన‌ 20 శాతం మంది వైసీపీలో జాయిన్ అయిన త‌ర్వాత‌ యువ టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది.
 
ఇక టీడీపీ బాట‌లోనే ఇత‌ర పార్టీ నాయ‌కులు, చాలా కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న నాయ‌కులు కూడా వైఎస్ జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ద‌మ‌య్యారు. అయితే ఇదే క్ర‌మంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు.  నాలుగేళ్ల క్రితం వైసీపీని వీడిన తర్వాత ఆయన భవిష్యత్తుకి సంబంధించి రకరకాల చర్చలు జ‌రిగాయి. ఈ చ‌ర్చ‌లో భాగంగానే చంద్రబాబును కలిసి టీడీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌చ్చాయి. 
 
కానీ గంటా వర్గం వ్యతిరేకించడంతో కొణతాల సైలెంట్ అయిపోయారు. ఇక ఆయ‌న తిరిగి వైసీపీలో చేరుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక వేళ‌ ఆయ‌న కానీ వైసీపీలో చేరితే 2019 లో వైజాగ్ లో జ‌గ‌న్ జెండా ఎగ‌ర‌డం ఖాయం అంటున్నారు విశ్లేష‌కులు. ఎందుకంటే గంట శ్రీనివాస్ చేసే ప్ర‌తీ పని కొణతాలకు తెలుసు కాబ‌ట్టి ఆయ‌న చేసే ప్ర‌తిది ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తారు. 
 
దీంతో టీడీపీ ఫివ‌ర్ తగ్గి వైసీపీ ఫివ‌ర్ అమాంతంగా లేస్తుంద‌ని భావించి ఇటీవ‌లే వైసీపీలో చేరిన య‌ల‌మంచిలి ర‌వి మాజీ ఎమ్మెల్యే  క‌న్న‌బాబు రాజు త‌న వంతుగా కొణతాల వైసీపీలో చేర్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ క్ర‌మంలో రాజు ఇప్ప‌టికే కొణ‌తాల‌ను క‌లిసి మాట్లాడార‌ట‌, కానీ కొణ‌తాల‌ను స‌రిగ్గా స్పందించ‌లేద‌ట‌. 
 
అందుకే వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డితో పాటు పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ కూడా కొణ‌తాల‌తో ఫోన్లో మాట్లాడార‌ట‌. దీంతో ఆయ‌స సానుకూలంగా స్పందించ‌డంతో తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.