జ‌గ‌న్ అలా చేయ‌డంతోనే....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-26 10:16:53

జ‌గ‌న్ అలా చేయ‌డంతోనే....

దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు  ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్ర‌స్తుత టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొండా సురేఖ కీల‌క పాత్ర పోషించారు. వ‌ర్గ‌పోరుతో  పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న త‌మ‌కు రాజ‌కీయంగా జ‌న్మ‌నిచ్చింది వైయ‌స్సార్ అని కొండ సురేఖ ఓ ఇంట‌ర్వూలో చెప్పారు. 
 
వైయ‌స్సార్ మ‌ర‌ణాంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్ధాపించిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బ‌య‌ట‌కు రావడానికి గ‌ల కార‌ణాల‌ను ఆమె ఇంటర్వూలో తెలిపారు. పూర్తిగా స‌మైక్యాంధ్ర వాదంతో కాకుండా తెలంగాణ వాదాన్ని కూడా గౌర‌వించాల‌ని జ‌గ‌న్ ను కోర‌మ‌ని గుర్తు చేశారు.
 
అయితే  స‌మైక్యాంధ్ర వాదం వైపే జ‌గ‌న్ నిల‌బ‌డ్డార‌ని అందుకే తాము వైసీపీ నుండి బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింద‌ని అన్నారు.  రాజ‌కీయంగా వైయ‌స్సార్ జ‌న్మ‌నిస్తే, తెలంగాణ ముఖ్య‌మంత్రి  పున‌ర్జ‌న్మ‌నిచ్చార‌ని కొండా సురేఖ ఇంట‌ర్వూలో తెలిపారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.