కోటం రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-17 12:01:57

కోటం రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టి ప్యాకేజీకి త‌లొగ్గిన చంద్ర‌బాబు ఇప్పుడైన  మేల్కోవాల‌ని కోటం రెడ్డి మీడియా ద్వారా హిత‌వు ప‌లికారు. 
 
కేంద్రం చేసిన అన్యాయంపై నిల‌దీసేందుకు రండి...అంద‌రం క‌లుద్దాం.....ఎంపీల నుండి కార్పోరేటర్ల‌తో స‌హా రాజీనామాలు చేద్దాం.. రాజ‌కీయ సంక్షోభాన్ని సృష్టిద్దాం....ఇలా చేసి అయినా పాపాన్ని క‌డుక్కో అంటూ కోటం రెడ్డి చంద్ర‌బాబుకు పిలుపునిచ్చారు. బాబు రాజ‌కీయ చ‌తుర‌త‌కు మోదీ, అమిత్ షా గ‌జ గ‌జ వ‌ణుకుతున్నార‌ని అందుకే అంబానిని రాయ‌బార‌నికి పంపారంటూ ప‌చ్చ మీడియా లీకులు ఇస్తోంద‌ని, ఇలాంటి అస‌త్య వార్త‌లు రాసేందుకు సిగ్గుండాలి అంటూ  కోటం రెడ్డి  తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. 
 
టీడీపీ కార‌ణంగా తెలుగు రాష్ట్రం కొన ఊపిరితో బతికి ఉంద‌ని, అది కూడా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మొద‌ట నుండి ప్ర‌త్యేక హోదా కోసం అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నందుకే అని కోటం రెడ్డి గుర్తు చేశారు. ఇప్ప‌టికైన తెలుగుదేశం పార్టీ మేల్కొని వైసీపీతో క‌లిసి కేంద్రంపై పోరాటం చేసేందుకు సిద్ద‌మౌతుందా లేదా చూడాలి. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.