కొత్తపల్లి గీతకు టీడీపీ షాక్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-25 15:14:57

కొత్తపల్లి గీతకు టీడీపీ షాక్ ?

ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ పార్టీల‌కు చెందుతారో అనేది ఇప్ప‌టికే అర్దంకాని ఓ ప్ర‌శ్న‌... ఫిరాయింపు అనేది తెలుగుదేశం పార్టీ నిర్విరామంగా ఇంకా కొన‌సాగిస్తూనేఉంది.. ఇటీవ‌ల ఉత్త‌రాంధ్రా వైసీపీ  ఎమ్మెల్యే కూడా త‌న‌ను పార్టీ ఫిరాయించ‌మ‌ని కోరుతున్నారు అని మీడియా ముఖంగా తెలియ‌చేశారు.. మొత్తానికి తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా ఆ లెవ‌ల్ రాజ‌కీయాల‌కు ఫుల్ స్టాప్ పెట్ట‌లేదు అనేది తెలుస్తోంది.
 
అయితే 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించ‌డం తెలిసిందే.. ఇక ముగ్గురు ఎంపీలు కూడా పార్టీ ఫిరాయించారు తెలుగుదేశంలోకి.. అయితే పార్ల‌మెంట్లో ఇటీవ‌ల ప్ర‌త్యేక‌హూదా కోసం వైసీపీ పోరాటం చేసింది.. ఆ స‌మ‌యంలో అవిశ్వాస తీర్మానం కేంద్రం పై ప్ర‌వేశ‌పెట్టారు... ఆ ప‌రిస్దితుల్లో ఫిరాయింపు ఎంపీలు ముగ్గురు ప‌రిస్దితి అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా మారింది.. అయితే స‌భ‌లో చ‌ర్చ‌కు రాలేదు- అలాగే  ఓటింగ్ కు రాలేదు కాబ‌ట్టి ఎంపీలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇక అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌కు తాజాగా ఓ షాక్ త‌గిలింది తెలుగుదేశం నుంచి.. ఆమె పలు కార‌ణాల వ‌ల్ల వైసీపీ నుంచి తెలుగుదేశానికి పార్టీ ఫిరాయించారు.. తాజాగా ఆమెపై మంత్రి అచ్చెన్నాయుడు ఓ కామెంట్ చేశారు. ఫిరాయింపు ఎంపీ కొత్తపల్లి గీత తమ పార్టీ సభ్యురాలు కాదని, ఆమె వైఎస్సార్‌సీపీ ఎంపీ అని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ..ఈ మాట ఎందుకు వ‌చ్చింది అని ప‌రిశీలిస్తే..? చంద్రబాబు దీక్షలతో ప్రజాధనం వృథా అని ఎంపీ కొత్తపల్లి గీత ప్రకటించారని ఓ విలేకరి ప్రస్తావించగా, ఆయన ఈ  వ్యాఖ్యలు చేశారు.
 
మొత్తానికి తెలుగుదేశం కూడా ఆమెను ప‌క్క‌న పెడుతోంది అనేది అర్ధం అవుతోంది... పార్టి ఫిరాయించిన వారికి ఒక్కొక్క‌రిని ప‌క్క‌న పెడుతున్న తెలుగుదేశం ఆమెను కూడా సైడ్ చేస్తోంది.. ఇక ఆమె కూడా బీజేపీ జ‌న‌సేన‌కు ద‌గ్గ‌ర అవుతున్నారు అంటూ వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మంత్రి అచ్చెన్న‌వ్యాఖ్య‌లు ఆలోచింప చేసేవిగా ఉన్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.