ఫిరాయింపు ఎంపీ కొత్త మార్గం..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-13 05:35:15

ఫిరాయింపు ఎంపీ కొత్త మార్గం..?

ఆ ఎంపీ పార్టీ ఫిరాయించి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించారు... ఆమే అర‌కు ఎంపీ కొత్త ప‌ల్లి గీత.. ఇక మిత్ర‌ప‌క్షంగా ఉన్న తెలుగుదేశంతో చేయి క‌లిపి, బీజేపీ కూడా ఇక్క‌డ ఫిరాయింపుల పై ఎటువంటి మాటా మాట్లాడ‌టం లేదు.... వారి పై వేటుకు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.
 
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కొత్త‌ప‌ల్లి గీత, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత పై విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే... తెలుగుదేశం అధినేత పై ప్ర‌సంస‌లు కూడా కురిపించారు.. అయితే రాజ‌కీయంగా తీవ్ర వ్య‌తిరేక‌త  రావ‌డంతో, ఆమె రాజ‌కీయ భ‌విష్య‌త్ పై నీలినీడ‌లు క‌మ్ముకోవ‌డంతో ఆమె రాజ‌కీయంగా యూట‌ర్న్ తీసుకున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఇక తెలుగుదేశం పై కూడా త‌న విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెడుతోంది... గ‌తంలో కూడా ఆమె తాను  తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ‌కురాలు కాదు అని చెప్పారు... ఇక తాజాగా ఆమె కేంద్రాన్ని ఏం అడ‌గాలో తెలియ‌ని స్దితిలో తెలుగుదేశం పార్టీ ఉంది అని  స‌టైర్ వేశారు... దీంతో పార్టీ ఫిరాయించిన స‌మ‌యంలో ఉన్న కొత్త ప‌ల్లి గీతేనా ఇటువంటి కామెంట్లు చేస్తున్న‌ది అని తెలుగుదేశం నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు..
 
రాష్ట్రం కోసం అంద‌రూ క‌లిసి రాజ‌కీయాలకు అతీతంగా పోరాడాలి అని ఆమె తెలిపారు..రైల్వేజోన్ విశాఖకు రావాలని, అది విశాఖ ప్రజల హక్కు అని వ్యాఖ్యానించారు. విజయవాడకు ఎయిమ్స్ రావడం వల్ల ఉత్తరాంధ్రకు నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. 
 
అన్ని సంస్థలు విజయవాడ, అమరావతికే వెళ్తున్నాయని, ఉత్తరాంధ్రకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు తెలుగుదేశం త‌ర‌పున ఎంపీ సీటు ఇచ్చే అవ‌కాశాలు లేవ‌ని ఇక కాంగ్రెస్ ప‌రిస్దితి అర‌కులో ఏ స్దితిలో ఉందో తెలిసిందే.. ఇటు జ‌న‌సేన‌లోకి ఆమె వెళ్ల‌వ‌చ్చు అని అంటున్నారు కొంద‌రు ఉత్త‌రాంధ్రా నాయ‌కులు. ఇక బీజేపీ నుంచి కూడా ఆమెకు ఆఫ‌ర్లు ఉన్నాయి అని అందుకే ఆమె ఇటువంటి ట‌ర్న్ రాజ‌కీయంగా తీసుకుంటున్నారు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.