గీత దాటిన ఫిరాయింపు ఎంపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-09 01:22:11

గీత దాటిన ఫిరాయింపు ఎంపీ

2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి  అర‌కు ఎంపీగా గెలిచిన కొత్త‌ప‌ల్లి గీత అధికార తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిన విష‌యం  తెలిసిందే. అయితే అనంత‌రం జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కొత్త‌ప‌ల్లి గీత టీడీపీని కూడా వీడ‌టం గ‌మ‌నార్హం. 
 
టీడీపీని వీడిన గీత ప్ర‌స్తుతం ఏ పార్టీలో కొన‌సాగ‌డం లేదు.  ఓవైపు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌ప‌ట్టిన బ‌డ్జెట్ పై పార్ల‌మెంట్ దద్ద‌రిల్లుతోంది.   ఫిరాయింపు నేప‌థ్యంలో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ప్ర‌శ్నిస్తే అన‌ర్హ‌త వేటు ప‌డుతుంద‌నే భ‌యంతో బుట్టా రేణుక‌, కొత్త‌ప‌ల్లి గీత పార్ల‌మెంట్ లో ఎలాంటి నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేయ‌డం లేదు. 
 
దీంతో తెలుగు మీడియా వీరిద్ద‌రి తీరును తీవ్రంగా త‌ప్ప‌బ‌ట్టింది. ఈ క్ర‌మంలో  ఎంపీ  గీత స్పందించిన విధానం  ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది. పార్ల‌మెంట్ లో టీడీపీ,వైసీపీ ఎంపీలు  చేస్తున్న నిర‌స‌న‌లు ఒక డ్రామాలా క‌నిపిస్తున్నాయని, ముందు కేంద్ర నిధుల‌కు ఏపీ  ఎందుకు లెక్కలు చెప్ప‌డం లేద‌ని గీత ప్ర‌శ్నించారు. 
 
పోలవ‌రం నిధుల‌పై ఎందుకు లెక్క‌లు చెప్ప‌డం లేద‌ని, ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్యాకేజీ ఇస్తే బావుందంటూ ఎందుకు స‌న్మానాలు చేయించుకున్నార‌ని  గీత టీడీపీపై విమర్శ‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి చేసిన అన్యాయాన్ని నిల‌దీయాల్సిన  ఎంపీ ఇలా బీజేపీకి వ‌త్తాసు ప‌లుకుతూ.... అధికార‌, ప్ర‌తిప‌క్షాల‌ను త‌ప్ప‌బ‌ట్ట‌డం విడ్డూరం. మొత్తానికి  గీత క‌మ‌లం పార్టీతో లైన్ క్లియ‌ర్ చేసుకుంద‌ని స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది.

షేర్ :

Comments

1 Comment

  1. TDP dramas

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.