సంచ‌ల‌నం టీడీపీ వైసీపీల‌కు వ్య‌తిరేకంగా మ‌రో కొత్త పార్టీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and tdp
Updated:  2018-08-23 05:36:49

సంచ‌ల‌నం టీడీపీ వైసీపీల‌కు వ్య‌తిరేకంగా మ‌రో కొత్త పార్టీ

2014లో హారా హోరీగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన కొత్త ప‌ల్లి గీత చాలా కాలంగా  రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఒకానొక సంద‌ర్భంలో గీతా, ఏపీ మూఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుంటార‌ని వార్తలు వ‌చ్చాయి. కానీ ఆమె పార్టీలో చేర‌లేదు. 
 
ఇక ఇదే క్ర‌మంలో గీత బీజేపీ తీర్థం తీసుకుంటార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి కానీ వాట‌న్నంటిపై స్పందించ‌కుండా సైలెంట్ గా ఉన్నారు మూడు సంవ‌త్స‌రాల పాటు. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో కొత్త‌ప‌ల్లి గీత అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు వ్య‌తిరేకంగా కొత్త పార్టీని స్థాపించాల‌నుకుంటున్నారు. ఇందుకు సంబ‌దించిన ఒక లేఖ‌ను కూడా విడ‌ద‌ల చేశారు కొత్త‌ప‌ల్లి గీత‌.
 
ఈ నెల 24వ తేది అంటే రేపు ఉద‌యం 11.30 నిమిషాల‌కు కొత్త పార్టీని లాంచ్ చేయ‌నున్నామ‌ని ఆమె పేర్కొన్నారు. విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్లో ఉన్న జ్యోతి క‌న్వెన్ష‌న్ హాల్లో పార్టీకి సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డిస్తాన‌ని గీత స్ప‌ష్టం చేశారు. ఇప్పుడున్న రాజ‌కీయ‌ ప‌రిస్థితిలో గీతా త‌న సొంత పార్టీతో ఎంత‌మేర‌కు నెగ్గుకొస్తారో వేచి చూడాలి.