రాయలసీమ జిల్లాలో కోట్ల కుటుంబానికి ఉండే క్రేజే వేరు.. పార్టీలకు అతీతంగా జానాకర్షన కలిగిన కుటుంబం వారిది...రాజకీయాల్లో కాస్త పేరొందిని నాయకుల కుటుంబంగా కోట్ల కుటుంబానికి పేరు ఉంది.. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరును ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా వారసత్వంగా నిలబెట్టారు.. కాంగ్రెస్ కు కంచుకోటగా వీరు ఉండేవారు జిల్లాలో.. అయితే ఏపీలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రావడం, తెలంగాణ రాష్ట్రంగా అవతరించడం విభజిత్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయే విధంగా దెబ్బతింది.. దీంతో ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఆయన భార్య సుజాతమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇరువురు కాంగ్రెస్ తరపున ఓటమిపాలయ్యారు.
ఇక వారి కుటుంబం వైసీపీలో చేరడానికి మంతనాలు జరుగుతున్నాయి అనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.. జగన్ కర్నూలు జిల్లా పాదయాత్ర సమయంలో కూడా అందరూ ఇదే చర్చించుకున్నారు.. ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉందని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.. కాని అది జరుగలేదు. ఇక అదే విధంగా ఆ కుటుంబాన్ని తెలుగుదేశంలో చేర్చుకునేందుకు రెడీ అయ్యారు మంత్రి లోకేష్..
జిల్లా తెలుగుదేశం నాయకులతో వర్తమానాలు పంపారు అని గతంలో తెలుగుదేశం కాంపౌండ్ లో చర్చించుకున్నారు. ఇక కోట్ల తనయుడు రాఘవేంద్రరెడ్డితో లోకేశ్ చర్చించారని కూడా వార్తలు వినిపించాయి.. అదే సమయంలో ఓ ఎంపీ సీటు, రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారట కాని ఇది ఎంత వరకూ సాధ్యమో వారే చర్చించుకున్నారు. ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న నాయకులకు కాదని మనకు ఇస్తారు అంటే నమ్మశక్యంగా లేదని కోట్ల ఆలోచించారు.
ఇక కర్నూలు ఎంపీ బుట్టారేణుక కూడా వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరడంతో ఆమెకు వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటు కేటాయిస్తారు అనే వార్తలు వినిపించాయి.. దీంతో తెలుగుదేశంలోకి వెళ్లినా మనకు అవకాశం ఉండదు అని ఫ్యూచర్ ని గ్రహించారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.... అలాగే ఇంటర్నల్ గా బుట్టారేణుకకు ఎమ్మిగనూరు టికెట్ వచ్చే ఎన్నికల్లో ఇస్తామని చెప్పినా, ఆయన నమ్మే పరిస్ధితిలో లేరు.. అందుకే ఇక వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలి అని ఆలోచించినట్లు తెలుస్తోంది. ఇక కేఈ కుటుంబం కూడా కోట్ల ఎంట్రీకి అయిష్టంగానే ఉంది.. ఈ సమయంలో పార్టీలోకి వెళ్లినా వర్గపోరు తప్పదు అని కోట్ల భావించారు.. ఇక తెలుగుదేశంలోకి ఆయన ఎంట్రీ ఉండదని మంచి ముహూర్తం చూసుకుని వైసీపీలో చేరే ఆలోచనలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉన్నారు అని జిల్లాలో టాక్ నడుస్తోంది.
Comments