కేఈకి కోట్ల వార్నింగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-28 17:01:01

కేఈకి కోట్ల వార్నింగ్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2019లో హోరా హోరీగా జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే టీడీపీ పొత్తుల‌పై ఆ పార్టీ మంత్రులు తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకించారు. అయితే ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు మాజీ కేంద్ర‌మంత్రి కోట్ల జ‌య‌సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి కాంగ్రెస్-టీడీపీ పొత్తుల‌పై స్పందించారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలో కాంగ్రెస్ టీడీపీలు పొత్తుపెట్టుకుని పోటీ చెయ్య‌వ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అరంగేట్రం చేసిన ప్ర‌స్తుత టీడీపీ డిప్యూటీ ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ మూర్తి ఇప్పుడు అదే పార్టీని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌డం స‌బబు కాద‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. 
 
ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో లేరు క‌నుక త‌మ పార్టీని తిడుతున్నార‌ని మ‌ళ్లీ రానున్న రోజుల్లో టీడీపీని వీడితే ఇలా తిట్ట‌డ‌నే న‌మ్మ‌కం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మంత్రి హోదాలో ఉండి మీరు ఇలా మాట్లాడ‌టం ఏమాత్రం మంచిదికాద‌ని కోట్ల జ‌య‌సూర్య హెచ్చ‌రించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.