వైసీపీలోకి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-11 16:49:29

వైసీపీలోకి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి

రాజ‌కీయాల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేని ఫ్యామిలీ కోట్ల ఫ్యామిలీ. వీరు గతంలోకాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాష్ట్ర రాజ‌కీయాల్లోనే కాదు దేశ‌రాజ‌కీయ‌ల్లోనూ ఓ వెలుగు వెలిగి త‌మ కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోట్ల వారు. ఆ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీలో మొద‌టి సారిగా 2014 లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా క‌రువ‌య్యాయి. 
 
ఇక అప్ప‌టి నుంచి వీరు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నా కూడా రాయ‌లసీమ‌లో వారి క్యాడ‌ర్ మాత్రం అలేగే ఉంది. క‌ర్నూల్ జిల్లాలో కోట్ల సూర్య ప్ర‌కాశ్ రెడ్డి ఒక మాట చెబితే చాలు సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇక్క‌డ నుంచి పోటీ చేసినా కూడా ఓట‌మి కావడం ఖాయం. 
 
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఈ జిల్లాలో అనేక చోట్ల అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేశారు. జిల్లాలో ఏ ఒక్క స‌మ‌స్య వ‌చ్చినా కూడా ప్ర‌త్య‌క్షంగా కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ద‌గ్గ‌రుండి చేయించే వారు. అంతే కాదు పూర్తి ప‌రిష్కారం వ‌చ్చేవ‌ర‌కు అక్క‌డే ఉండి ప‌నుల‌ను చేయించి వెళ్లే వారు. అందుకే క‌ర్నూల్ జిల్లా ప్ర‌జ‌ల‌కు కోట్ల ఫ్యామిలీ అంటే ఎన‌లేని అభిమానం. ఈ అభిమానంతోనే 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీచేసిన చెరుకుల‌పాడు నారాయ‌ణ రెడ్డికి రాష్ట్రంలో ఏ నాయ‌కుడికి రాన‌న్ని ఓట్లు  వ‌చ్చాయి. అలాగే ఏ జిల్లాలో రాన‌న్నిఅసెంబ్లీ సీట్లు కూడా గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌చ్చాయి. క‌డ‌ప త‌ర్వాత వైసీపీకి క‌ర్నూల్ జిల్లా కంచుకోట‌గా చెప్ప‌వ‌చ్చు. 
 
అయితే ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో జిల్లా మ‌రో రికార్డును కూడా సొంతం చేసుకుంది. అదేంటంటే... 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి అత్య‌ధిక మెజారిటీతో గెలిచిన వైపీపీ ఎమ్మెల్యేలు గతంలో అధికార‌ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చూపించిన ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి సూమారు ఈ జిల్లా నుంచి ఐదు మంది ఎమ్మెల్యేలు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. వీరు పార్టీ మార‌డంతో ఈ జిల్లా మ‌రో రికార్డ్ ను సొంతం చేసుకుంది.
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కోట్లసూర్య‌ప్ర‌కాశ్ రెడ్డిని, అలాగే కోట్ల సుజాత‌మ్మ‌ను వైసీపీలోకి తీసుకువ‌చ్చేందుకు కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే గ‌తంలో కూడా వీరు వైసీపీలో చేరుతున్నారంటూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ వార్త‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక ఇప్పుడు వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తారా లేక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో వైసీపీలోకి చేరుతారా అనేది ఆస‌క్తిగా మారుతోంది. 
 
ఒక వేళ వారు వైసీపీలో చేరితే ఖ‌చ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చెక్ పెట్టొచ్చు ఎందుకంటే క‌ర్నూల్ జిల్లాలో ఆయ‌న‌కు మించిన క్యాడ‌ర్ ఏ రాజ‌కీయ నాయ‌కుడికి లేదు. సో.... ఫిరాయింపులకు చెక్ పెట్ట‌డం చాలా ఈజీ. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.