కోట్ల సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-07 17:18:38

కోట్ల సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీలోకి కొంత కాలంగా చేరుతారు అనే వార్త‌లు వ‌స్తున్నాయి మాజీ ముఖ్య‌మంత్రి కోట్ల  కుటుంబం పై .
 
అయితే ఆయ‌న తాజాగా సీఎం చంద్ర‌బాబు పై తెలుగుదేశం పై ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డంతో, అస‌లు ఆయ‌న ఆ ఆలోచ‌న‌లో లేరు అనేది వాస్త‌వికంగా తేలిపోయింది. కోట్ల కుటుంబాన్ని తెలుగుదేశంలో చేర్చుకోవాలి అని భావిస్తున్నారు చంద్ర‌బాబు... అయితే ఇప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో చేర‌రు అనేలా సంకేతాలు ఇచ్చాయి.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలు ఆడటం మాని రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పోరాడాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక హోదా, విభజన హమీల కోసం చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంతో ముగిశాయి ఈ స‌మ‌యంలో ఆయ‌న ఈ కీల‌క వ్యాఖ్య‌లుచేశారు..
 
చంద్రబాబు నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని, చంద్రబాబు ప్యాకేజీ దండుకుని మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో హోదా భజన పేరుతో పార్లమెంటులో భజన చేస్తున్నారని ఆరోపించారు.
 
ప్రత్యేక హోదా ప్రాంతీయ పార్టీలతో రాదని కేవలం జాతీయ పార్టీతోనే అది సాధ్యమని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హోదా ఇవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. ఇక రాహుల్ గాంధీ మొద‌టి  సంత‌కం ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇస్త‌ము అని చెపుతున్నారు ఇటు  మ‌రో వైపు కాంగ్రెస్ నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల్లోకి ఈ విష‌యాన్ని బాగా ప్రాచుర్యంగా తీసుకువెళుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.