టీడీపీ ఎమ్మెల్యేలు ద‌ద్ద‌మ్మ‌లు ‍‍‍‍

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-30 18:30:05

టీడీపీ ఎమ్మెల్యేలు ద‌ద్ద‌మ్మ‌లు ‍‍‍‍

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సుర్య‌ప్ర‌కాశ్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్ల‌డుతూ, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కులు సుమారు ఆరువంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌క‌టించి ఒక్క హామీని కూడా పూర్తిగా అమ‌లు చేయ‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. 
 
క‌ర్నూల్ జిల్లాలో తాగునీరు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతుంటే జిల్లా టీడీపీ నాయ‌కులు చూస్తు ఉండిపోయారు త‌ప్ప ప్ర‌జ‌ల‌కు ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డంలేద‌ని సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఆరోపించారు. అవ‌త‌ల అనంత‌పురం జిల్లా టీడీపీ నాయ‌కులు 272 జీవోను అమ‌లు చేసుకుని నీరు తీసుకుని పోతుంటే క‌ర్నూల్  జిల్లా టీడీపీ నాయ‌కులు నీరు తీసుకు రాకుండా చ‌వ‌ట ద‌ద్ద‌మ్మలుగా త‌యారు అవుతున్నార‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.
 
నాలుగు సంత్స‌రాల టీడీపీ ప‌రిపాల‌న‌లో గతంలో ఎన్న‌డు లేని విధంగా తెలుగు త‌మ్ముళ్లు అవినీతి అక్ర‌మాలకు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఎన్ ఆర్ ఈజీ ఎస్ ప‌నులు, నీరు చెట్టు, మ‌రుగుదొడ్లు నిర్మాణం కింద టీడీపీ నాయ‌కులు కోట్ల రూపాయ‌ల‌ను వెనుక వేసుకుంటున్నార‌ని కోట్ల విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు టీడీపీ విచ్చ‌ల విడిగా రియ‌ల్ ఎస్టెట్ మాఫియా చెల‌రేగిపోతుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
గతంలో ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ మూర్తి హంద్రీనివా నుంచి జిల్లాలో ఉన్న చెరువులకు నీరు ఇస్తామ‌ని మాట ఇచ్చి త‌ప్పార‌ని ఆయ‌న ఆరోపించారు. వ‌చ్చే నెల ఆగ‌స్టు 18వ తేదిన కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున మ‌హాస‌భ‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని, ఈ స‌భ‌కు పార్టీ అధినేత రాహుల్ గాంధీ హాజ‌రు అవుతార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

1 Comment

  1. Miru nijanga anti tdp aithe miru congress tarupuna evarini poti ki dimparu endukante congress ap chala mosam chesindi miru daniki support chesi malli tdp ni tittadam inka tappu tdp oka bekar party congress inka bekar party nenu kuda kotla abhimanine kani ilanti situation lo miru chala teliviga undal

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.