పార్టీ మారడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది... రాజకీయంగా రసవత్తరంగా మారుతున్నాయి పార్టీ ఫిరాయింపులు, అయితే తెలుగుదేశం పార్టీ తరపున తెలంగాణ లో గెలిచిన నాయకులు టీఆర్ ఎస్ పార్టీలోకి ఫిరాయిస్తే, పార్టీ మారిన వారిని అక్కడ ప్రశ్నించిన చంద్రబాబు, ఇక్కడ ఏపీలో వైసీపీ తరపున గెలిచిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించే లా చేశారు..
దీంతో తెలుగుదేశం పై అనేకసార్లు వైసీపీ ఫిర్యాదు చేసింది.. అయినా ఎటువంటి మార్పు లేదు, అంతే కాదు వైసీపీ నుంచి గెలిచిన వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కారు చంద్రబాబు.. అయితే రాజకీయంగా జగన్ అనేక సార్లు వారిని రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు రావాలి అని పిలుపునిచ్చారు అవేమీ పట్టనట్లు బాబు వ్యవహారించారు.
ఇక వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలకు కూడా పార్టీ ఫిరాయించారు.. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత..వైసీపీ ఎంపీలపై ఫిర్యాదుచేశారు.... అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో విప్‌ను గౌరవిస్తూ సభలో లేచి నిలబడని కొత్తపల్లి గీతపై వైసీపీ ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు... దీనికి ఆమె వైసీపీ ఎంపీలపై కౌంటర్‌గా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు కొత్తపల్లి గీత. వైసీపీ ఎంపీలు తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవంటూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేధిస్తున్నారని ఆమె వివరించారు. అందుకే ఆయన పై చర్యలు తీసుకోవాలి అని ఆమె ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ కేవలం అడుగుతోందని కఠిన చర్యలు తప్పవు అని చెప్పడం కూడా తప్పా అని వైసీపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు.
షేర్ :
Comments
1 Comment
Mar-23-2018 12:00:00
Mogudu vundaga vere vadito sambandam pettukovadam anta tappo geeta garu kooda ante tappu politicslo chestunnaru nuvvu anni karanalina cheppu nuvvu chesedi tappu tappu
Mogudu vundaga vere vadito sambandam pettukovadam anta tappo geeta garu kooda ante tappu politicslo chestunnaru nuvvu anni karanalina cheppu nuvvu chesedi tappu tappu