కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-30 13:10:07

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు

తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్, గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలో జ‌రుగుతున్న  జ‌గ‌న్ పాద‌యాత్ర లో ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... అంతేకాదు జ‌గ‌న్ వెంట ప‌లువురు నాయ‌కులు పార్టీలో చేరి ఆయ‌న‌తో పాటూ న‌డుస్తున్నారు..
 
ఇక ఇక్క‌డ జ‌గ‌న్ తీసుకున్న ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తెలుగుదేశానికి ఓ పెద్ద షాక్ అనే చెప్పాలి.. నీరు చెట్టు కార్య‌క్ర‌మం ఎటువంటి ప‌ద్ద‌తిలో ఇక్క‌డ‌ న‌డుస్తుందో చూపించారు అక్క‌డ గ్రామ‌స్దులు...  ఇక్క‌డ కొస‌మెరుపు ఏమిటి అంటే ఇక్క‌డ ఎన్టీఆర్ బంధువులు జ‌గ‌న్ వెంట  న‌డిచి తెలుగుదేశం నాయ‌కులు ఎటువంటి రాజ‌కీయాలు చేస్తున్నారో అవినీతిని క‌ళ్లారా చూపించి వివ‌రించారు.
 
అలాగే మూడు నుంచి నాలుగు అడుగులు తవ్వాల్సిన చెరువులో మ‌ట్టిని 40 అడుగుల‌కు త‌వ్వి ట్రాక్ట‌ర్ మ‌ట్టిని 350 నుంచి 500 రూపాయ‌ల‌కు అమ్ముకుంటున్నార‌ని, ఎన్టీఆర్ సొంత ఊరిలో 50 ల‌క్ష‌ల రూపాయ‌ల స్కాం నేరుగా జ‌గ‌న్ కు చూపించారు గ్రామ‌స్దులు... అన్నిప‌థ‌కాలు  వారికి చెందిన నాయ‌కులకు, తెలుగుదేశం  కేడ‌ర్ కు మాత్ర‌మే ఆఫ‌లాలు అందుతున్నాయి అని తెలియ‌చేశారు గ్రామ‌స్దులు.
 
ఇక  మంత్రి నారాలోకేష్ ఈ గ్రామాన్ని ద‌త్తత తీసుకున్నా కూడా, ఇక్క‌డ ఎటువంటి అభివృద్ది జ‌రుగ‌డం లేదు అని తెలియ‌చేశారు. ఇక  జ‌గ‌న్ ఇక్క‌డ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు... త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కృష్ణాజిల్లా పేరును నంద‌మూరి తార‌క‌రామారావు జిల్లాగా మారుస్తాం అని, ఆ మ‌హ‌నీయుడి పేరును పెడ‌తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించి అక్క‌డ హామీ ఇచ్చారు...
 
దీంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ త‌గిలింది... నాలుగు సంవ‌త్స‌రాలు అధికారంలో ప్ర‌స్తుతం ఉన్న చంద్ర‌బాబు, గ‌తంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ఏనాడు ఇటువంటి మంచినిర్ణ‌యం తీసుకోలేద‌ని, ఆ మ‌హానీయుడికి ఏ నాడు వీరు గౌరవం ఇవ్వ‌లేద‌ని, జ‌గ‌న్ పార్టీల‌కు అతీతంగా జిల్లా పేరు ప్ర‌క‌టించ‌డం చాలా సంతోషం అంటున్నారు ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.