టీడీపీలో కొత్త భ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-11 18:38:09

టీడీపీలో కొత్త భ‌యం

తొలి నుంచి తెలుగుదేశానికి ప్ర‌త్యేక హూదా పై ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవాలి అనేది తెలియ‌లేదు... కేంద్రం ఏది చెప్పితే అది పాటించారు.. చివ‌ర‌కు కేంద్రం  త‌న‌కు అనుకూలంగా రాజ‌కీయం సీఎం చంద్ర‌బాబుతో ఆడించింది..ముందు ప్ర‌త్యేక హూదా అంది త‌ర్వాత ప్ర‌త్యేక ప్యాకేజీ అంది...ఇప్పుడు ప్ర‌త్యేక హూదా అంటూ యూట‌ర్న్ తీసుకున్నారు.... ఏకంగా అసెంబ్లీ వేదిక‌గా  మ‌న‌పై కేసులు పెట్టినా భ‌య‌పెట్టినా భ‌య‌ప‌డేది లేదు ఎవ్రీ థింగ్ ఐనో అనేలా మాట్లాడుతున్నారు.
 
ఇటు 23 మందిని పార్టీ ఫిరాయించేలా తెలుగుదేశం స‌క్సెస్ అయింది.. అయితే తెలుగుదేశం మాత్రం  ఈ ఫిరాయింపులు ఎలా ఉన్నా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు అస‌లు అధికారం వ‌స్తుందా లేదా అనే ఆలోచ‌న‌లో ఉంది.. దీనికి కార‌ణాలు అనేకం క‌నిపిస్తున్నాయి.. అయినా తెలుగుదేశం నాయ‌కులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం మాదే , కేంద్రం పై పోరాడ‌తాం, 25 ఎంపీ స్ధానాలు మ‌న పార్టీనే గెలిపించండి.. జ‌గ‌న్ ను ఓడించి 175 స్ధానాల్లో తెలుగుదేశం విజ‌యం చేకూరేలా ఎమ్మెల్యేల‌ను గెలిపించండి అని తెలియ‌చేస్తున్నారు బాబు.
 
అయితే జ‌గ‌న్ చాలా తెలివిగా పొలిటిక‌ల్ స్టెప్స్ వేస్తున్నారు... తెలుగుదేశంలో అస‌మ్మ‌తి వ‌ర్గాన్ని అంద‌రిని త‌న ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటున్నారు జ‌గ‌న్ అని తెలుగుదేశం భావిస్తోంది... కాని జ‌గ‌న్ ప‌లు ఈక్వేష‌న్ల‌తో నాయ‌కుల‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇటు య‌ల‌మంచిలి ర‌విని కృష్ణా జిల్లాలోకి పాద‌యాత్ర వ‌చ్చే స‌మ‌యానికి పార్టీలోకి చేర్చాలి అని నాయ‌కులు భావించారు... అయితే ఎంపీలు  సుజ‌నా-  కేశినేని - సీఎం చంద్ర‌బాబు ఎంత చెప్పినా తెలుగుదేశం హామీలు న‌మ్మ‌లేక‌పోయారు ర‌వి... దీంతో ఆయ‌న  జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేర‌డానికి రెడీ అయ్యారు.. పాద‌యాత్ర‌లో ఆయ‌న పార్టీలో చేర‌నున్నారు.
 
అయితే కృష్ణా జిల్లాలో వైసీపీలో చేరేందుకు నాయ‌కులు రెడీ అవుతున్నారు.. కొత్త‌గా జ‌గ‌న్ వ‌ద్ద‌కు చేరేందుకు మ‌రో ఇద్ద‌రు నేత‌లు రెడీగా ఉన్నారు అని తెలుస్తోంది... ఈ లిస్టులో ఎవ‌రు ఉన్నారు అనే ఆలోచ‌న‌ల‌తో అన్ని సెగ్మెంట్ల‌లో తెలుగుదేశం నాయ‌కుల‌తో టీడీపీ అధిష్టానం వివ‌రాలు సేక‌రిస్తోంద‌ట... పార్టీ నుంచి ఎవ‌రిని చెద‌ర‌కుండా ఉండేందుకు ఆఫ‌ర్లు వీలైతే ఇప్పుడే భీ ఫాంలు ఇచ్చే లా రెడీ అవుతోంద‌ట సైకిల్ పార్టీ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.