బాబుకు షాక్ టీడీపీకి రాజీనామా చేసిన కీల‌క నేత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-07 17:12:30

బాబుకు షాక్ టీడీపీకి రాజీనామా చేసిన కీల‌క నేత

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి అధికారంలోకి రావాల‌నే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నత‌రుణంలో ఆయ‌న‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నుంచి త‌న‌కు త‌గిన గుర్తింపు లేద‌ని చెప్పి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు, అలాగే సీనియ‌ర్ నాయ‌కులు అమాంతంగా టీడీపీకి గుడ్ బై చెప్పి ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో టీడీపీ సర్కార్ వారిని బుజ్జ‌గించే కార్య‌క్ర‌మం చేస్తోంది.  
 
అధికారంలో ఉన్న నాయ‌కులు ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరితే పార్టీ ప‌రువుతో పాటు ప్ర‌జ‌ల‌కు మ‌న మీద న‌మ్మ‌కం పోతుంద‌ని భావించి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బుజ్జ‌గింపు కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. కానీ నూటికి 90 శాతం మంది తాము పార్టీ విడేదంటే వీడేద‌ని తెగేసి చెబుతున్నారు తెలుగు త‌మ్ముళ్లు.
 
అయితే ఇదే జాబితాలో మ‌రో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు చేరారు. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మ‌న్, కృష్ణా జిల్లా టీడీపీ సీనియ‌ర్ నేత బూర‌గ‌డ్డి ర‌మేష్ నాయుడు ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి పంపిన‌ట్లు ఆయ‌న మీడియా ద్వారా వివ‌రించారు. గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగా పార్టీకి ఎనలేని సేవ‌లను అందిస్తున్నా కూడా పార్టీ అధిష్టానం త‌న‌ను గుర్తించ‌డంలేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
కాగా భ‌విష్య‌త్ లో ఆయ‌న ఏ పార్టీలో చేరుతార‌నేది మాత్రం చెప్ప‌లేదు. కానీ విస్వ‌స‌నీయ వర్గాల స‌మాచార ప్ర‌కారం త్వ‌ర‌లో వైసీపీ తీర్థం తీసుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.